Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

యూకే మార్కెట్లో కొత్త రిట్జ్‌ను విడుదల చేసిన సుజుకి

Posted by:
Published: Saturday, July 7, 2012, 17:55 [IST]

మారుతి సుజుకి అందిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్ గురించి గతంలో విభిన్న కథనాల్లో తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్‌ను యూరప్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఈ కారును సుజుకి స్ప్లాష్ (Suzuki Splash) అని పేరుతో కంపెనీ మార్కెటింగ్ చేస్తోంది.

యూకే మార్కెట్లో సుజుకి స్ప్లాష్ ధర 7,777 జిబిపి (బ్రిటీష్ పౌండ్స్)లుగా ఉంది. అంటే మన దేశ కరెన్సీలు సుమారు రూ.6.69 లక్షలన్నమాట. ముందు, వెనుక వైపు సరికొత్త బంపర్స్, కొత్త బోనెట్, కొత్త గ్రిల్ డిజైన్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్ వంటి ప్రధాన మార్పులను కొత్త రిట్జ్‌లో గమనించవచ్చు.


సుజుకి స్ప్లాష్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. అక్కడి రోడ్లపై 1.0 లీటర్ 68 బిహెచ్‌పి పెట్రోల్ ఇంజన్ లీటరుకు 25 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుండగా, 1.2 లీటర్ 93 బిహెచ్‌పి పెట్రోల్ ఇంజన్ లీటరుకు 23 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. యూకే మార్కెట్లో కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే సుజుకి స్ప్లాష్ లభ్యమవుతుంది. ఇది ఎస్‌జెడ్2, ఎస్‌జెడ్3, ఎస్‌జెడ్4 అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, ఎమ్‌పి3 ప్లేయర్, లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పవర్ విండోస్ స్టాండర్డ్ ఫీచర్లుగా లభించనున్నాయి. ఆప్షనల్ ఫీచర్లుగా 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, టింటెడ్ విడోస్, కీలెస్ ఎంట్రీ ఫీటర్లు లభిస్తాయి. ఇందులో స్పార్క్లింగ్ బ్లూ మెటాలిక్, బిసన్ బ్రౌన్ పెరల్ మెటాలిక్ అనే రెండు కొత్త రంగులను జోడించారు. కొత్త రిట్జ్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫేస్‌లిఫ్ట్ రిట్జ్‌ను కంపెనీ ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. డిజైన్ విషయంలో యూరోపియన్ వెర్షన్ రిట్జ్‌కు ఇండియన్ వెర్షన్ రిట్జ్‌కు పెద్దగా తేడాలు ఉండకపోవచ్చని సమాచారం.

English summary
Suzuki launches facelifted Ritz (called as Splash in UK) in UK market. We expect new face-lifted Ritz will launch India before Diwali. Suzuki Splash facelift will be powered by two petrol engines.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu