టెస్ట్ డ్రైవ్ చేస్తే నిస్సాన్ మైక్రా కారును గెలుచుకునే అవకాశం

శనివారం, ఫిబ్రవరి 18, 2012, 15:26 [IST]
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న చిన్న కారు మైక్రా కోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన క్యాంపైన్‌ను ప్రారంభించింది. "మైక్రా కారును టెస్ట్ డ్రైవ్ చేసి, మైక్రా కారును గెలుచుకోండి" అంటూ నిస్సాన్ సరికొత్త ప్రచారాని శ్రీకారం చుట్టింది. ఈ క్యాంపైన్‌లో భాగంగా నిస్సాన్ మైక్రాను టెస్ట్ డ్రైవ్ చేసే వారికి, డీలర్‌షిప్ కేంద్రాలలో ఓ లక్కీ డ్రా ఫారమ్‌ను ఇవ్వడం జరుగుతుంది.

టెస్ట్ డ్రైవ్‌కు హాజరైన వారు ఈ ఫారమ్‌ను పూర్తగా భర్తీ చేసి లక్కీ డ్రా బాక్సులో వేయాల్సి ఉంటుంది. ప్రతి వారానికి ఒక్కసారి లక్కీ డ్రాను తీయడం జరుగుతుంది. ఇలా ఆరు వారాల పాటు లక్కీ డ్రాను తీసి, ఒక్కొక్క వారం ఒక్కొక విజేతను ఎన్నుకొని, ఒక్కొక్కరికి ఒక మైక్రా కారు చొప్పున మొత్తం ఆరు నిస్సాన్ మైక్రా కార్లను బహుకరించడం జరుగుతుంది. ఈ టెస్ట్ డ్రైవ్ ఆఫర్ ఫిబ్రవరి 11 నుండి మార్చి 23 వరకూ చెల్లుబాటులో ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా టెస్ట్ డ్రైవ్ కోసం ఆన్‌లైన్ రిజిస్టర్ చేసుకోవడమే.

మైక్రా టెస్ట్ డ్రైవ్‌కు రిజిస్టర్ చేసుకోవడం ఎలా..?

* నిస్సాన్ మైక్రా అధికారిక వెబ్‌సైట్‌ (http://nissanmicra.co.in/contest/) ఓపెన్ చేసి మీ పేరు, ఊరు/నగరం పేరు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి వివరాలను నింపి మూడు చిన్న ప్రశ్నలకు సమాధానం చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

* ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే, మీ ఈ-మెయిల్ ఐడి/మొబైల్ ఫోన్‌కు టెస్ట్ డ్రైవ్‌కు సంబంధించిన సమాచారం అందుతుంది. ఈ సమాచారాన్ని ప్రింట్అవుట్ తీసి, టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు మీ వెంట తీసుకుని వెళ్లాలి.

* టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు చెల్లుబాటు కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకువెళ్లటం తప్పనిసరి.

* టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత డీల్ నుండి డ్రైవ్ కన్‌ఫర్మేషన్ స్లిప్‌ను కలెక్ట్ చేసుకొని, మీ వద్ద భద్రపరుచుకోవాలి, ఇదే లక్కీ డ్రాకు ఫైనల్ టికెట్ అవుతుంది.

* ప్రతి టెస్ట్ డ్రైవ్‌కు డీలర్లు ఓ ఉచిత బహుమతిని ఇవ్వడం జరుగుతుంది.

* లక్కీ డ్రా గెలుపొందిన విజేతల వివరాలను, వారు ఇచ్చి మెయిల్ ఐడి/ఫోన్ నెంబర్ల ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయబడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నిస్సాన్ మైక్రా టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేసుకొని మీ లక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి.

English summary
Nissan Motors India is running a special promotion for its small car Micra called "Take a test drive & win a Nissan Micra every week". This promotion is valid from 11th Feb to 23rd March 2012. All you have to do is log on to the Nissan Micra official website and book your test drive.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .