Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

స్పెషల్ ఎడిషన్ నానో విడుదల చేయనున్న టాటా మోటార్స్

Written by:
Published: Saturday, October 13, 2012, 17:53 [IST]

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానో త్వరలోనే మరిన్ని హంగులతో ముస్తాబై కొనుగోలుదారుల ముందుకు రానుంది. ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు అనేక కార్ కంపెనీలు ఇప్పటికే స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ తమ బుజ్జి కారు నానోలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ఈ పండుగ సీజన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ టాటా నానోకు సంబంధించిన సమాచారాన్ని మా సన్నిహిత ఆటో బ్లాగ్ గాడి డాట్‌కామ్ ముందుగా ప్రచురించింది.

ఈ స్పెషల్ ఎడిషన్ టాటా నానోకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం..

tata launch special edition nano during diwali

స్పెషల్ ఎడిషన్ టాటా నానో ఎక్స్టీరియర్‌లో మార్పులు:

  • ఎల్ఎక్స్, సిఎక్స్ వేరియంట్లలో స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్
  • ఎల్ఎక్స్ వేరియంట్‌పై ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్
  • ఎల్ఎక్స్, సిఎక్స్ వేరియంట్లో సి పిల్లర్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జెస్

స్పెషల్ ఎడిషన్ టాటా నానో ఇంటీరియర్‌లో మార్పులు:

  • ఎల్ఎక్స్, సిఎక్స్ వేరియంట్లో డ్యాష్‌బోర్డ్‌పై గ్లౌవ్‌బాక్స్
  • ఎల్ఎక్స్, సిఎక్స్ వేరియంట్లో యూఎస్‌బి, ఆక్స్-ఇన్ ఆప్షన్‌తో కూడిన ఆడియో సిస్టమ్

అయితే, ఈ స్పెషల్ ఎడిషన్ టాటా నానో కారును సొంతం చేసుకోవాలంటే మాత్రం, కొనుగోలుదారులు ప్రస్తుత ధరపై అధనంగా సుమారు రూ.25,000లు చెల్లించాల్సి ఉంటుంది. (అదనపు ఫీచర్లు కావాలంటే ఆ మాత్రం చెల్లించక తప్పదు మరి). ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇది టాటా నానో స్టాండర్డ్ వేరియంట్‌లో మాత్రం లభ్యం కాదు. స్పెషల్ ఎడిషన్ నానో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురా, సిక్కిం రాష్ట్రాలలో మాత్రమే లభ్యమవుతుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టాటా నానో కారుపై కంపెనీ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కొనుగోలుదారులు ఇప్పుడు కేవలం రూ.15,000 డౌన్‌పేమెంట్‌కే టాటా నానో కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రతి పాత కారు ఎక్సేంజ్‌పై రీసేల్ వ్యాల్యూ కాకుండా అదనంగా రూ.30,000 ఎక్సేంజ్ బోనస్‌ను, అలాగే పాత ద్విచక్ర వాహన ఎక్సేంజ్‌పై రూ.15,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Image Source: Gaadi.com

English summary
Tata Motors is bringing a Nano Special Edition, packed with accessories worth Rs.25,000, like Alloy Wheels, Blaupunkt Music System, Glove Box and Designer De-cals. The Special Edition Tata Nano will be available in the states of WB, Karnataka, Gujarat, Maharashtra, Goa, Kerala, Assam, Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Tripura and Sikkim only.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu