Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

హనీవెల్ టర్బోఛార్జర్‌తో రానున్నా టాటా నానో డీజిల్

Posted by:
Published: Friday, June 1, 2012, 16:49 [IST]

ప్రస్తుతం పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న తరుణంలో అధిక మైలేజ్‌నిచ్చే కార్లకే కొనుగోలుదారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా డీజిల్‌తో నడిచే కార్లు అధిక మైలేజ్‌ను ఇస్తాయి కాబట్టి, ఇప్పుడు వీటి కొనుగోళ్లు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ లీటర్ డీజిల్‌కు 40 కిలోమీటర్ల మైలేజీనిచ్చే టాటా నానో డీజిల్ వేరియంట్‌పైనే కేంద్రీకృతమై ఉన్నాయి.

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోలో ఓ డీజిల్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. టాటా నానో కోసం డీజిల్ ఇంజన్ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుతం టాటా నానో పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్మన్ విడి భాగాల కంపెనీ బోష్ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేయటంలో కూడా తమ తోడ్పాటును టాటా మోటార్స్‌కు అందిస్తుంది.

tata nano diesel come with honeywell turbo

టాటా నానో డీజిల్ వేరియంట్ గురించి తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం, ఇందులో పూనేకు చెందిన ప్రముఖ టర్బోఛార్జర్ల తయారీ కంపెనీ 'హనీవెల్' నుండి పొందిన టర్బో ఛార్జర్లను టాటా నానో డీజిల్ వేరియంట్‌లో ఉపయోగించనున్నారు. టాటా నానో డీజిల్ వేరియంట్ 800సీసీ ఇంజన్‌ను కలిగి ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ వేరియంట్ ఇంజన్ సామర్థ్యం 624సీసీ మాత్రమే. డీజిల్ కార్లలో ఉపయోగించే టర్బోఛార్జర్లు ఇంజన్ పెర్ఫామెన్స్‌ను పెంచడంలో సహకరిస్తాయి.

మార్కెట్ సమాచారం ప్రకారం, టాటా నానో డీజిల్ ఇంజన్ అభివృద్ధి తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే టాటా మోటార్స్ డీజిల్ వేరియంట్ టాటా నానో కారును విడుదల చేసి, మైలేజ్ పరంగా ప్రపంచంలో మరో సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయం. కాగా.. ఇప్పటి మార్కెట్ ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటే పెట్రోల్ కార్లకు డిమాండ్ తగ్గి ప్రత్యామ్నాయ ఇంధనంతో (డీజిల్, ఎల్‌పిజి, సిఎన్‌జి వంటివి) నడిచే కార్లకు డిమాండ్ జోరందుకుటున్న తరుణంలో గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఆవిష్కరించిన టాటా నానా సిఎన్‌జి వేరియంట్‌ను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ మొగ్గు చూపుతోంది.

English summary
As we reported earlier about Tata Nano's diesel variant, today we come-up with new details about this small car. According to market sources Tata Nano Diesel car will be equipped with a turbocharger from Honeywell.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu