Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

అమెరికన్ మార్కెట్ కోసం టాటా నానో రీడిజైనింగ్!

Written by:
Published: Wednesday, October 17, 2012, 17:36 [IST]

ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా రికార్డు సృష్టించిన టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో ఇప్పుడు అమెరికా వెళ్లేందుకు ముస్తాబవుతోంది. ఇండియాలో అంతంత మాత్రంగా అమ్ముడవుతున్న టాటా నానో కారును అమెరికన్ మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. రానున్న మూడేళ్లలో నానో కారును అమెరికాలో మార్కెట్లో విడుదల చేస్తామని టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా తెలిపారు. కాగా.. అమెరికా మార్కెట్ కోసం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న నానో కారును కాకుండా, ఈ కారులో అనేక మార్పులు చేర్పులు చేసి అక్కడి మార్కెట్లో విడుదల చేయనున్నారు.

భారత దేశంలో టాటా నానో ధర 3,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 1.5 లక్షలు)గా ఉన్న నానో కారు అమెరికన్ మార్కెట్లో10,000 అమెరికన్ డాలర్ల (సుమారు రూ.5 లక్షలకు పైమాటే) కన్నా తక్కువ ధరకే అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ కూడా టాటా నానో అమెరికన్ మార్కెట్లో లభ్యమవుతున్న కార్లలో కెల్లా అత్యంత చవకైన కారుగా నిలువనుంది. ప్రస్తుతానికి అమెరికాలో లభిస్తున్న అత్యంత చవకైన కారు నిస్సాన్ వెర్సా. అక్కడి మార్కెట్లో దీని ధర 11,750 అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 6 లక్షలకు పైమాటే.

tata redesign the nano us market debut

అయితే, టాటా నానో అమెరికన్ మార్కెట్లో ప్రవేశించాలంటే అంత సులువైన అంశం కాదు. ప్రస్తుతం మన దేశంలో లభిస్తున్న నానో కారును అలానే అమెరికన్ మార్కెట్లో విడుదల చేస్తే, దానిపై రాళ్లు పడటం ఖాయం. కాబట్టి, అక్కడి మార్కెట్ కోసం టాటా మోటార్స్ నానోలో అనేక మార్పులు చేయనుంది. పవర్ స్టీరింగ్, ట్రాక్షన్ కంట్రోల్, మెరుగైన ఇంజన్ (800సీసీ లేదా 1000సీసీ), ఎయిర్‌బ్యాగ్స్, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో కూడిన ఇంటీరియర్స్, ప్రీమియం సీటింగ్ వంటి అనేక మార్పులు అమెరికన్ వెర్షన్ నానోలో ఉండే అవకాశం ఉంది.

కాగా.. యూరప్ మార్కెట్ల కోసం కూడా టాటా మోటార్స్ ఓ సరికొత్త నానో కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అమెరికన్ వెర్షన్ నానో అక్కడి రోడ్లపై పరుగులు తీయటానికి మాత్రం మరో మూడేళ్ల సమయం పట్టనుంది. ఏదేమైనప్పటికీ, అమెరికాలో ఇప్పటికే ఓ నానో కారు చేరిపోయింది. అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన టాక్-షో వ్యాఖ్యాత, హాస్యనటుడు అయిన 'జే లెనో' ఇండియా నుండి ప్రత్యేకంగా ఓ టాటా నానో కారును ఆర్డర్ చేయించుకొని మరీ తన గ్యారేజ్‌కు తరలించుకున్నాడు.

English summary
Tata Motors has announced its plans of redesigning the world's cheapest car Tata Nano for US market debut. "The US is a very enticing market," said Ratan Tata, CEO of India's Tata Group in an interview with Automotive News. "We hope that the sub-$10,000 car has appeal."
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu