Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

టాప్ 10 జేమ్స్ బాండ్ కార్లు - ఫోటోలు

Written by:
Published: Friday, November 2, 2012, 19:24 [IST]

ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో జేమ్స్ బాండ్ ఫీవర్ నెలకొని ఉంది. రహస్యాలను ఛేధించి, ప్రజనలు దేశాన్ని రక్షించే ఓ అద్భుతమైన పాత్ర జేమ్స్ బాండ్. ఈ క్యారెక్టర్ పుట్టి ఇప్పటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వచ్చిన 23వ జేమ్స్ బాండ్ చిత్రం 'స్కైఫాల్' (Skyfall) బాక్సాఫీసుల వద్ద భారీ రికార్డులతో ప్రారంభమైంది. జేమ్స్ సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. అంతేకాకుండా.. ఇందులో ఉపయోగించే కార్లు, వాహనాలకు కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.

గడచిన 50 ఏళ్లుగా వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాల్లో గమనిస్తే.. ప్రతి సినిమాలో ఓ విశిష్టమైన కారును కానీ లేదా వాహనాన్ని కానీ జేమ్స్ బాండ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయటం జరిగింది. ఇటీవలి కాలంలో బాండ్ సినిమాల్లో ఎక్కువగా పాపులర్ అయిన కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ అనే చెప్పుకోవచ్చు. కేవలం ఆస్టన్ మార్టిన్ కార్లే కాకుండా ఇతర కార్లను కూడా జేమ్స్ బాండ్ క్యారెక్టర్లు ఉపయోగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జేమ్స్ బాండ్ క్యారెక్టర్లు ఉపయోగించిన కార్లను ఈ ఫోటో ఫీచర్‌లో పరిశీలిద్దా రండి...!

ఆస్టన్ మార్టిన్ డిబి5

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ నుంచి అత్యంత పాపులర్ అయిన ఈ ఎంట్రీ లెవల్ కార్ ఆస్టన్ మార్టిన్ డిబి5 మోడల్‌ను గోల్డ్‌ఫింగర్, థండర్‌బాల్, గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్, క్యాసినో రాయల్, స్కైఫాల్ చిత్రాల్లో ఉపయోగించారు.

లోటస్ ఈస్పిరిట్ ఎస్1

'ది స్పై హు లవ్‌డ్ మి' అనే బాండ్ సినిమాలో ఈ లోటస్ ఈస్పిరిట్ ఎస్1 కారును ఉపయోగించారు.

ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్

'ది లివింగ్ డేలైట్స్' అనే జేమ్స్ బాండ్ చిత్రంలో ఈ ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారును ఉపయోగించారు.

బిఎమ్‌డబ్ల్యూ 750ఐఎల్

పాపులర్ మూవీ టుమారో నెవర్ డైస్ (భూలోక వీరుడు 007) అనే సినిమాలో తొలిసారిగా బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ (750ఐఎల్) కారును ఉపయోగించారు.

మెర్క్యూరీ కౌగర్ ఎక్స్ఆర్-7

'ఆన్ హెర్ మెజిస్టీస్ సీక్రెట్ సర్వీస్' అనే జేమ్స్ బాండ్ సినిమాలో ఈ మెర్క్యూరీ కౌగర్ ఎక్స్ఆర్-7 కారును ఉపయోగించారు.

లోటస్ ఈస్పిరిట్ టర్బో

'ఫర్ యువర్ ఐస్ ఓన్లీ' అనే జేమ్స్ బాండ్ సినిమాలో ఈ లోటస్ ఈస్పిరిట్ టర్బో కారును ఉపయోగించారు.

టొయోటా 2000జిటి రోడ్‌స్టర్

'యు ఓన్లీ లివ్ ట్వైస్' అనే జేమ్స్ బాండ్ సినిమాలో ఈ టొయోటా 2000జిటి రోడ్‌స్టర్ కారును ఉపయోగించారు.

ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాచ్ 1

'డైమండ్స్ ఆర్ ఫరెవర్' అనే జేమ్స్ బాండ్ సినిమాలో ఈ ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాచ్ 1 కారును ఉపయోగించారు.

బిఎమ్‌డబ్ల్యూ జెడ్8

'ది వరల్డ్ ఈజ్ మాంట్ ఎనఫ్' అనే జేమ్స్ బాండ్ సినిమాలో ఈ బిఎమ్‌డబ్ల్యూ జెడ్8 కారును ఉపయోగించారు.

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్

'క్యాసినో రాయల్ అండ్ క్వాంటమ్ ఆఫ్ సోలేస్' అనే జేమ్స్ బాండ్ సినిమాలో ఈ ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ కారును ఉపయోగించారు.

English summary
Growing up, most of us have been James Bond fans. We are still James Bond fans, are you? How can one forget, the legendary words, "Bond. James Bond." Be it exotic locations, beautiful girls or smoking hot cars, a Bond movie was always and will always be loaded with them.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu