చౌక ధరకే ఆటోమేటిక్ కరోలాను విడుదల చేసిన టొయోటా

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 10:56 [IST]
టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం (డి-సెగ్మెంట్) సెడాన్ 'కరోలా'లో ఓ సరికొత్త వెర్షన్‌ను చడిచప్పుడు లేకుండా మార్కెట్లో విడుదల చేసింది. ఇదే సెగ్మెంట్లోని హోండా సివిక్, స్కొడా లారా, చెవర్లే క్రూజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తున్న కరోలా ఆల్టిస్‌లో ఆటోమేటిక్ వెర్షన్‌ను టికెఎమ్ విడుదల చేసింది.

'టొయోటా కరోలా ఆల్టిస్ జి-హెచ్‌వీ ఏటి' పేరుతో మార్కెట్లోకి విడుదలైన, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) సెడాన్ ధర రూ.13.76 లక్షలుగా ఉంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. కరోలాలో ఉండే కొన్ని స్టాండర్డ్ ఫీచర్లను ఈ ఆటోమేటిక్ వెర్షన్‌లో తొలగించడం ద్వారా, తక్కువ ధరకే కంపెనీ ఈ మోడల్‌ను అందిస్తోంది.

డి-సెగ్మెంట్లో లభిస్తున్న ఆటోమేటిక్ సెడాన్లలోకెల్లా ఇదే చవకైనది. అయితే, కేవలం పెట్రోల్ వేరియంట్ కరోలా ఆల్టిస్‌లో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ ఆప్షన్ లభిస్తుండటం విచారకరం. డీజిల్ వేరియంట్లో ఆటోమేటిక్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేయలేదు. డీజిల్ వేరియంట్ కరోలా ఆల్టిస్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.
English summary
The D-segment sedan segment is a hotly contested zone. But the king of the hill has been the Toyota Corolla. It has been successful in out running competition from the Honda Civic, the Skoda Laura and the Chevrolet Cruze. Now its dominance will be pushed further up as Toyota Kirloskar has quietly launched a new automatic variant that is priced at Just Rs.13.76 lakhs.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .