Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఇండియాలో పవర్‌ఫుల్ ఎస్‌యూవీ విడుదల చేసిన కాంక్వెస్ట్

Posted by:
Updated: Monday, August 20, 2012, 14:15 [IST]

టొరంటోకు చెందిన కాంక్వెస్ట్ వెహికల్స్ కంపెనీ భారత మార్కెట్లో ఓ సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీని విడుదల చేసింది. విఐపిలు, పారామిలటరీ బలగాల కోసం సాయుధాలతో కూడిన వాహనాలను తయారు చేసే కాంక్వెస్ట్ తొలిసారిగా సాధారణ ప్రజల వినియోగార్థం తయారు చేసిన కవచాలు లేని (అన్ఆర్మోర్డ్) ఎస్‌యూవీ 'ఎవేడ్'ను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది.

ఈ కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ ధర వింటే గుండె గుబేల్‍‌మనటం ఖాయం. ఇండియా ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8 కోట్లు. ఇదే ఎస్‌యూవీ ఆయుధాలు, కవచాలతో కూడిన వెర్షన్‌ను నైట్ ఎక్స్‌వి (Knight XV) అని పిలుస్తారు. కాంక్వెస్ట్ ఎవేడ్ సుమారు 400 ఘనపు అడుగుల ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి విశాలమైన రూమ్, విలాసాలను అందిస్తుంది.

unarmored conquest evade launched india

కాంక్వెస్ట్ ఎవేడ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో 4x4 వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది. సరికొత్త బాడీ స్టయిల్, కొత్త హెడ్‌లైట్స్, సన్నటి ఫెండర్ గార్డ్స్, రీడిజైన్ చేయబడిన గ్రిల్, హుడ్ స్కూప్, విడెల్పాటి వెనుక డోర్, సన్‌రూఫ్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు. దీని బరువును తగ్గించేందుకు గానూ ఎక్స్టీరియర్లను తక్కువ బరువు కలిగిన అల్యూమినియం మెటీరియల్స్‌తో తయారు చేశారు.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇది 2-2 లీమో స్టయిల్ సీటింగ్‌ను కలిగి ఉండి, స్ట్రెచ్ చేయడానికి వీలుగా ఉంచాయి. ల్యాప్‌టాప్ ట్రేలు, పెద్ద టెలివిజన్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థలను చూడొచ్చు. మిలటరీ వాహనాల నుంచి స్ఫూర్తి పొంది దీని ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. డ్రైవర్, ప్యాసింజర్ కోసం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జాయ్‌స్టిక్ ద్వారా కంట్రోల్ చేయబడే సెర్చ్‌లైట్స్, ఎఫ్ఎల్ఐఆర్ నైట్ విజన్ కెమెరాలు వంటి అనేత అత్యాధునిక ఫీచర్లు కాంక్వెస్ట్ ఎవేడ్ సొంతం. లగ్జరీ రైడ్ కోరుకునే విఐపిలు, ప్రముఖులను దృష్టిలో ఉంచుకొని కాంక్వెస్ట్ ఈ వాహనాన్ని ఇండియాలో విడుదల చేసింది.

Story first published:  Monday, August 20, 2012, 12:03 [IST]
English summary
Toronto based Conquest Vehicles Inc. has launched unarmored version of its sports utility vehicle Evade in India. Conquest Evade SUV is priced at Rs. 8 crore (Ex-showroom).
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu