Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఈ పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కార్లు

Posted by:
Published: Saturday, August 18, 2012, 18:12 [IST]

కార్ ప్రియులకు ఈ పండుగ సీజన్ మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టనుంది. రానున్న పండుగ సీజన్‌లో కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం సరికొత్త కార్లు కొలువుదీరనున్నాయి. ఓ వైపు భారత ఆటోమొబైల్ మార్కెట్ మందకొడిగా సాగుతున్నప్పటికీ, కార్ కంపెనీ మాత్రం సరికొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కార్లేంటో, వాటి వివరాలేంటో ఓ లుక్కేద్దాం రండి..!!

సరికొత్త మారుతి 800 కారు:
కనుమరుగై పోతున్న మారుతి 800 స్థానాన్ని భర్తీ చేస్తూ దేశపు అగ్రగామి కార్ కంపెనీ ప్రవేశపెట్టనున్న సరికొత్త 800సీసీ కారు ఈ దీపావళి నాటికి మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఆల్టో 800 కారు ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న ఈ చిన్న కారు ఇదివరకటి వెర్షన్ కన్నా మెరుగైన మైలేజ్‌ను ఆఫర్ చేయనుంది.


అంతేకాకుండా.. ధర విషయంలో కూడా కేవలం రూ.2 లక్షలకే ఈ చిన్న కారును అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఇటు టాటా నానోకు, అటు హ్యుందాయ్ ఇయాన్ మధ్యలో రానున్న కొత్త ఆల్టో 800 కారుపై మార్కెట్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కారును రానున్న పండుగ సీజన్‌లోనే విడుదల చేయాలని కంపెనీ పట్టుదలతో ఉంది.

మానేసర్ ప్లాంట్ లాకౌట్‌లో ఉన్నప్పటికీ ఈ చిన్న కారు విడుదలు ఎలాంటి ఢోకా లేదని, అనుకున్న సమయానికి దీనిని మార్కెట్లో ప్రవేశపెడతామని కంపెనీ స్పష్టం చేసింది. ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు గాను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఇంజన్, ఆకర్షనీయమైన డిజైన్, స్టయిల్, ఫీచర్లతో కంపెనీ తమ కొత్త ఆల్టో 800 తీర్చిదిద్దింది.

మారుతి సుజుకి అందిస్తున్న రెండు 800సీసీ మోడల్స్ (మారుతి 800, ఆల్టో 800)తో పోలిస్తే, కొత్తగా మార్కెట్లోకి రానున్న ఈ 800సీసీ కారు అన్ని విధాలుగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. ప్రస్తుతం మారుతి 800 ధరలు రూ.2.05 నుంచి రూ.2.3 లక్షల రేంజ్‌లోనూ, ఆల్టో 800 ధరలు రూ.2.4 నుంచి రూ.3.43 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. విశ్వసనీయమైన బ్రాండ్, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, ఈ సెగ్మెంట్లో విశాలమైన ఇంటీరియర్ స్పేస్, మెరుగైన మైలేజ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే, ఈ సగ్మెంట్లో కొత్త ఆల్టో 800 సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

English summary
This festive season is going to be more colorful for car buyers. Car maker waiting to launch more new cars in this festive season to cash the market sentiment. Maruti Suzuki is all set to launch its new 800cc car this festive season. The Indian carmaker is planning to bring a new look Alto 800 by Diwali.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu