Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

అప్‌డేటెడ్ పోలో, వెంటో కార్లను విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్

Posted by:
Published: Tuesday, September 4, 2012, 20:52 [IST]

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న పోలో హ్యాచ్‌బ్యాక్, వెంటో సెడాన్‌లలో సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్లను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. దేశీయ కార్ మార్కెట్లో రోజురోజుకు పెరుగుతున్న పోటీతో ఈ రెండు మోడళ్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఫోక్స్‌వ్యాగన్ పోలో, ఫోక్స్‌వ్యాగన్ వెంటో కార్లను సరసమైన ధరలకే కంపెనీ అందించాలని నిర్ణయించింది.

టాప్ ఎండ్ వేరియంట్లలో లభ్యం కానున్న ఈ అప్‌డేటెట్ వెర్షన్ల ధరలు పాత వేరియంట్లతో పోల్చుకుంటే తక్కువగా ఉండటమే కాకుండా, మరిన్ని అధనపు ఫీచర్లను కలిగి ఉండనున్నాయి. అప్‌డేటెట్ ఫోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ డీజిల్ ధర రూ. 6.94 లక్షలుగా ఉంది. ఇదివరకటి వేరియంట్‌తో పోల్చుకుంటే దీని ధర రూ.42,000 తక్కువ. (ఇదివరకటి పోలో హైలైన్ డీజిల్ ధర రూ.7.36 లక్షలు).


అలాగే, అప్‌డేటెట్ ఫోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ డీజిల్ ధర రూ. 9.89 లక్షలుగా ఉంది. ఇదివరకటి వేరియంట్‌తో పోల్చుకుంటే దీని ధర రూ.31,000 తక్కువ. (ఇదివరకటి వెంటో హైలైన్ డీజిల్ ధర రూ.10.20 లక్షలు). అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. అప్‌డేటెడ్ వెర్షన్ పోలో, వెంటో కార్లలో లభించే విశిష్టమైన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

అప్‌డేటెడ్ ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌లో లభించే ఫీచర్లు:
* బ్లాక్ హెడ్‌ల్యాంప్స్
* కొత్త అల్లాయ్ వీల్స్
* యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన ఆర్‌సిడి 310 మ్యూజిక్ సిస్టమ్
* లెథర్‌తో కవర్ చేయబడిన మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్
* లెథర్‌తో కవర్ చేయబడిన గేర్‌షిఫ్ట్ నాబ్ మరియు బ్యాండ్ బ్రేక్ లివర్
* వేగాన్ని బట్టి ఆడియో సిస్టమ్ సౌండ్ తగ్గేలా రూపొందించిన స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్
* బ్లూటూత్ డివైజ్
* ధర రూ.6.94 లక్షలు

అప్‌డేటెడ్ ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్‌లో లభించే ఫీచర్లు:
* బ్లాక్ హెడ్‌ల్యాంప్స్
* కొత్త అల్లాయ్ వీల్స్
* 4 స్పీకర్లు
* రియర్ వ్యూ కెమెరా, బ్లూటూత్‌తో కూడిన నావిగేషన్ సిస్టమ్
* ధర రూ.9.89 లక్షలు

ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన అప్‌డేటెడ్ పోలో, వెంటో కార్లు ఈ ఏడాది మధ్య భాగం నుండి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. ఇవి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో (హైలైన్) మాత్రమే లభ్యం కానున్నాయి.

English summary
German carmaker Volkswagen has just launched updated top-end diesel versions of its flagship models Polo and Vento. These two new variants get a minor facelift and many more features. The new Polo Highline will now cost Rs 6.94 lakh (ex-showroom Delhi), while the new Vento Highline sedan will be available at Rs 9.89 lakh (ex-showroom Delhi).
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu