Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఫోక్స్‌వ్యాగన్ నుంచి మరింత శక్తివంతమైన ఇంజన్ గల పోలో

Written by:
Published: Wednesday, October 3, 2012, 15:12 [IST]

జర్మనీకి చెందిన కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'పోలో'లో మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజన్ కలిగిన వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. కాగా.. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశట్టనున్న పవర్‌ఫుల్ ఫోక్స్‌వ్యాగన్ పోలో 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం వెంటోలో ఉపయోగిస్తున్న 1.6 లీటర్ డీజిల్ ఇంజన్‌కు కుదించబడిన వెర్షనే ఈ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్.

మరింత స్పోర్టీ ఫీల్, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్ వంటి మోడళ్లను సవాల్ చేసేలా ఫోక్స్‌వ్యాగన్ ఈ కొత్త పోలోను తీర్చిదిద్దనుంది. భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని, ఇది విభిన్నమైన బోర్, స్ట్రోక్‍‌లను కలిగి ఉంటుందని ఫోక్స్‌వ్యాగన్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ఛీఫ్ డా. ఉల్రిచ్ హ్యాకెన్‌బర్గ్ తెలిపారు.


కంపెనీ కొత్తగా అభివృద్ధి చేస్తున్న 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్, ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ 3-సిలిండ్ డీజిల్ ఇంజన్ కన్నా స్మూత్‌గా ఉండి, మెరుగైన పవర్‌ను ఆఫర్ చేయనుంది. ప్రస్తుతం ఈ కొత్త ఇంజన్ అభివృద్ధి దశలో ఉన్న నేపథ్యంలో, దీని పవర్, టార్క్‌లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనప్పటికీ, ఈ ఇంజన్‌ను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయటం ద్వారా దీని ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం వెంటోల ఉపయోగిస్తున్న 1.6 లీటర్ డీజిల్ ఇంజన్‌ను దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. పెట్రోల్ వెర్షన్ పోలోలో 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 5400 ఆర్‌పిఎమ్ వద్ద 75 పిఎస్‌ల శక్తిని, 3750 ఆర్‌పిఎమ్ వద్ద 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 17.24 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ పోలోలో 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4200 ఆర్‌పిఎమ్ వద్ద 75 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 180 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 22.07 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

English summary
German carmaker Volkswagen has officially confirmed that it will introduce more powerful Polo hatchback in India. Company is developing a new 1.5-litre diesel engine which will be used in the upcoming Volkswagen Polo.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu