చౌక రకం కార్లను విడుదల చేసిన వోల్వో ఇండియా

గురువారం, ఫిబ్రవరి 16, 2012, 17:00 [IST]
Volvo New Launches
స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా అత్యంత చౌక ధరకే మూడు మోడళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రస్తుతం వోల్వో ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న వోల్వో ఎస్‌60, ఎస్‌80 సెడాన్లు, ఎక్స్‌సీ60 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)లలో చౌక వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలు రూ.23.2 లక్షల నుండి రూ.35.9 లక్షల (ఎక్స్‌-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

ఇది వరకూ ఈ మోడళ్లు డి5 సిరీస్ డీజిల్ ఇంజన్‌లో లభ్యమయ్యేవి. కాగా, వోల్వో ఇండియా కొత్తగా విడుదల చేసిన ఎస్‌60, ఎస్‌80, ఎక్స్‌సీ60 వాహనాల్లో డి3 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. అందుకే వీటి ధరను భారీగా తగ్గించడం జరిగింది. వీటిల్లో డి3 ఇంజన్లను ఉపయోగించినప్పటికీ పెర్ఫామెన్స్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని వోల్వో పేర్కొంది. డి5 ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతున్న ఈ మోడళ్ల ధరలు రూ.27 లక్షల నుంచి రూ.39.5 లక్షల (ఎక్స్‌-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

ఈ మూడు మోడళ్లు కూడా పూర్తిగా విదేశాల్లో తయారు చేయబడి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో వీటిని ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న డి5 ఇంజన్లను అమర్చిన ఎస్60, ఎస్80, ఎక్స్‌సీ60 మోడళ్లను యదావిధిగా కొనసాగిస్తామని, మరింత శక్తివంతమైన ఇంజన్‌తో విలాసవంతమైన అనుభూతిని కోరుకునే వారి కోసం వీటిని అందుబాటులో ఉంచుతామని కంపెనీ వెల్లడించింది.
English summary
Volvo, the Swedish carmaker has launched three new variants of its models that are priced much lower than their predecessors. Volvo has taken on its competitors head on by offering its products at a much lower price despite selling all its models as CBUs (Completely Built Units). CBUs attract more excise tax than cars that are assembled within India.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .