పికాంటో హ్యాచ్‌బ్యాక్ ద్వారా ఇండియాకు రానున్న కియా

Kia Picanto
హ్యుందాయ్‌కు చెందిన ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ 'కియా' భారత మార్కెట్లో కాలు మోపేందుకు తహతహలాడుతోంది. గతంలోనే కియా భారత ప్యాసింజర్ మార్కెట్లోకి ప్రవేశించాలని భావించినప్పటికీ వివిధ కారణాల వలన అది సాధ్యం కాలేకపోయింది. అయితే, ఇప్పుడు తాజాగా.. కియా రూపొందించిన చిన్న కారు "పికాంటో" చెన్నై రోడ్లపై పరుగులు తీస్తుండటాన్ని బట్టి చూస్తే, ఈసారి ఖచ్చితంగా, అనుకున్న సమయం కంటే ముందుగానే కియా ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ ఇండియాకు ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారు పాపులరో, కియాకు పికాంటో కారు కూడా అంతే పాపులర్. కియా ప్రస్తుతం ఈ కారును భారత రోడ్లపై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఇది గనుక విజయవంతమైతే పికాంటో చిన్న కారును భారత మార్కెట్లో విడుదల చేయడం ద్వారా కంపెనీ దేశీయ విపణిలోకి అధికారికంగా ప్రవేశించనుంది. పికాంటో, హ్యుందాయ్ ఐ10 కార్లు రెండూ కూడా కామన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించబడ్డాయి.

కియా పికాంటో 3536 మి.మీ. పొడవును, 200 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉండి, 2700 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. పొడవులో ఐ10 కన్నా కాస్తంత తక్కువగా ఉండే పికాంటో వీల్‌బేస్‌లో మాత్రం ఐ10 కన్నా ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. హ్యుందాయ్ ఐ10 385 మి.మీ. పొడవును, 2380 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దాదాపుగా హ్యుందాయ్ ఐ10లో ఉండే అన్ని ఫీచర్లు పికాంటోలో ఉండే అవకాశం ఉంది.

టాప్ ఎండ్ వేరియంట్ పికాంటోలో స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానికి సైడ్ వ్యూ మిర్రర్స్, రియర్ వైపర్ అండ డిఫాగ్గర్, ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. పికాంటో హ్యాచ్‌బ్యాక్‌ను కియా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ10కు ఎగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక దీని ధర విషయానికి వస్తే. రూ.3.5 లక్షల నుండి రూ.6 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
The Picanto is a small car buity by Hyundai's subsidiary brand Kia. The small car is being tested extensively fueling rumors about the small car being launched in India.
Story first published: Monday, February 6, 2012, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X