2013 టాటా నానో; వేరియంట్ల వారీగా ఫీచర్ల వివరాలు

By Ravi

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారు 'టాటా నానో'లో కంపెనీ ఇటీవలే ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని, తమపై పడిన చీప్ కార్ అనే ముద్రను మాపుకునేందుకు గాను, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నానో కన్నా డిజైన్, ఫీచర్ల మరింత మెరుగ్గా ఉండేలా టాటా మోటార్స్ ఈ సరికొత్త 2013 టాటా నానో‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ కొత్త 2013 టాటా నానోలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్లంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి.

మరి ఏయే వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తున్నాయో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

2013 టాటా నానో ఎల్ఎక్స్:
టాప్-ఎండ్ వేరియంట్ టాటా నానోలో బీజ్ లేదా బ్లాక్ థీమ్డ్ ఇంటీరియర్స్, బెస్ట్ ఇన్ క్లాస్ ఎయిర్ కండిషనింగ్, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన గ్లౌబాక్సులు, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఆంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్, ఫ్రంట్ పవర్ విండోస్, 12 వోల్ట్ పవర్‌ సాకెట్‌తో కూడిన రీస్టయిల్డ్ సెంటర్ కన్సోల్, రిమోట్ కీలెస్ ఎంట్రీ/లాకింగ్, సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రానిక్ ట్రిప్ మీటర్, రియర్ పార్సిల్ షెల్ఫ్, ఫ్రంట్ కన్సోల్‌పై కప్ హోల్డర్స్, ఫాగ్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ బంపర్స్, రియర్ స్పాయిలర్, ఫుల్ వీల్ కవర్స్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ వైపు టిప్-టాప్ మిర్రర్స్, బూస్టర్ అసిస్టెడ్ బ్రేక్స్ ఫీచర్లు లభిస్తాయి. ఇది డాజల్ బ్లూ (కొత్త కలర్), పప్పాయ ఆరెంజ్, రాయల్ గోల్డ్ (కొత్త కలర్), మోజిటో గ్రీన్, మెటెఓర్ సిల్వర్ మరియు పెరల్ వైట్ రంగులో లభిస్తుంది.

2013 టాటా నానో సిఎక్స్:
నానో సిఎక్స్ వేరియంట్లో స్పోర్టీ బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్, ఎబోనీ బ్లాక్ డ్యాష్‌బోర్డ్ కలర్‌తో రిఫ్రెష్ చేయబడిన ఇంటీరియర్స్‌ను గమనించవచ్చు. ఇందులో స్పీకర్ గ్రిల్స్‌‌తో కూడిన రెండు గ్లౌబాక్సులు, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, బెస్ట్ ఇన్ క్లాస్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, రియర్ పార్సిల్ సెల్ఫ్, బూస్టర్ అసిస్టెడ్ బ్రేక్స్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ వైపు టిప్-టాప్ మిర్రర్స్, హాఫ్ వీల్ కవర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇది రాయల్ గోల్డ్ (కొత్త కలర్), పప్పాయ ఆరెంజ్, రోగ్ రెడ్, కార్న్‌ఫ్లోర్ బ్లూ (కొత్త కలర్), మెటెఓర్ సిల్వర్ మరియు సెరెన్ వైట్ రంగులో లభిస్తుంది.

2013 టాటా నానో స్టాండర్డ్:
నానో స్టాండర్డ్ వేరియంట్లో క్లియర్ హెడ్‌ల్యాంప్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, టిప్-టాప్ డ్రైవర్ సైడ్ మిర్రర్, బూస్టర్ అసిస్టెట్ బ్రేక్స్, యాంటీ-రోల్ బార్‌తో కూడిన ఫ్రంట్ సస్పెన్షన్, ఎబోనీ బ్లాక్ డ్యాష్‌బోర్డ్, డ్యూయెల్ టోన్ వినైల్ సీట్స్, ఫోల్డబల్ రియర్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇది రోగ్ రెడ్, సెరెన్ వైట్ మరియు కార్న్‌ఫ్లోర్ బ్లూ (కొత్త కలర్) రంగులో లభిస్తుంది.

2013 టాటా నానో

2013 టాటా నానో

డాజల్ బ్లూ (కొత్త కలర్ ఆప్షన్)

2013 టాటా నానో

2013 టాటా నానో

బ్లాక్ ఇంటీరియర్స్, బాడీ కలర్‌కు తగినట్లుగా స్పీకర్ల చూట్టూ మెటాలిక్ రింగ్

2013 టాటా నానో

2013 టాటా నానో

బీజ్ ఇంటీరియర్స్, బాడీ కలర్‌కు తగినట్లుగా స్పీకర్ల చూట్టూ మెటాలిక్ రింగ్

2013 టాటా నానో

2013 టాటా నానో

రాయల్ గోల్డ్ (కొత్త కలర్ ఆప్షన్)

2013 టాటా నానో

2013 టాటా నానో

టాప్-ఎండ్ వేరియంట్ టాటా నానో ఎల్ఎక్స్ ఇంటీరియర్స్

2013 టాటా నానో

2013 టాటా నానో

ఇటీవల కొత్త 2013 నానోను ఆవిష్కరించిన కంపెనీ అధికారులు.

జెట్ బాడీ కిట్

జెట్ బాడీ కిట్

సిల్వర్ ఫినిష్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, ఎల్ఎక్స్ వేరియంట్ కోసం స్పోర్ట్ బాడీ కిట్ అండ్ సైడ్ స్కర్ట్స్, రేస్ థీమ్డ్ బాడీ డెకాల్స్, సైడ్స్ మరియు బానెట్‌పై బాడీ స్ట్రైప్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.27,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.28,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

రీమిక్స్ బాడీ కిట్

రీమిక్స్ బాడీ కిట్

సిల్వర్ ఫినిష్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, ఎల్ఎక్స్ వేరియంట్ కోసం స్టయిల్ బాడీ కిట్ అండ్ సైడ్ స్కర్ట్స్, ఎయిర్ ఫ్లో బాడీ డెకాల్స్, సైడ్స్ మరియు బానెట్‌పై బాడీ స్ట్రైప్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.27,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.28,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

ఆల్ఫా బాడీ కిట్

ఆల్ఫా బాడీ కిట్

బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన రూఫ్ మరియు ఫ్రంట్ ఎయిర్‌ఇన్‌టేక్‌లు, బ్లాక్ అల్లాయ వీల్స్, బోల్డ్ అండ్ డైనమిక్ సైడ్ గ్రాఫిక్స్, బానెట్‌పై బాడీ స్ట్రైప్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.19,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.20,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

పీచ్ బాడీ కిట్

పీచ్ బాడీ కిట్

బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యే అల్లాయ్ వీల్స్, సైడ్స్ మరియు బానెట్‌పై పింక కలర్ బాడీ గ్రాఫిక్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.16,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

2013 టాటా నానో సిఎన్‌జి

2013 టాటా నానో సిఎన్‌జి

కొత్త నానోతో పాటుగా, ఆ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో ఓ సిఎన్‌జి వెర్షన్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేసింది.

2013 టాటా నానో సిఎన్‌జి

2013 టాటా నానో సిఎన్‌జి

నానో సిఎన్‌జి ఇంటీరియర్స్

2013 టాటా నానో సిఎన్‍‌జి

2013 టాటా నానో సిఎన్‍‌జి

2013 టాటా నానో సిఎన్‍‌జి

2013 టాటా నానో సిఎన్‍‌జి

2013 టాటా నానో సిఎన్‌జి

2013 టాటా నానో సిఎన్‌జి


కొత్త 2013 టాటా నానో ఎక్స్టీరియర్లలో చేసిన మార్పుల విషయానికి వస్తే, సరికొత్త కలర్ ఆప్షన్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ స్ట్రిప్స్‌, వెనుక వైపు ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్‌ మరియు నానో స్టయిల్‌ను పెంచేందుకు నాలుగు ఆకర్షనీయమైన బాడీ కిట్ ఆప్షన్స్, సులువుగా స్టీరింగ్‌ను ఆపరేట్ చేసేలా అప్‌గ్రేడ్ చేసిన సస్పెన్షన్ సిస్టమ్‌ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

కాగా, కొత్త నానో బేసిక్ డిజైన్, ఇంజన్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం దేశీయ విపణిలో టాటా నానో ప్రారంభ ధర రూ.1.50 లక్షలు (స్టాండర్డ్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. టాటా నానో నాలుగేళ్లు లేదా 60,000 కి.మీ. (ఏది ముందుగా ముగిస్తే అద్) వారంటీతో లభిస్తుంది. ఈ నెలలోనే ఇది మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Tata Motors announced the introduction of an array of new features available on the Tata Nano, including remote keyless entry, twin glove boxes, and a four-speaker AmphiStream™ music system with Bluetooth™, USB and auxiliary connectivity.
Story first published: Tuesday, July 2, 2013, 17:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X