2013 ఫార్ములా వన్ కార్స్: అన్నీ ఒక్కచోట

By Ravi

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్ములా వన్ జట్లు ప్రతి సంవత్సరం తమ సరికొత్త ఫార్ములా 1 కార్లను ప్రదర్శిస్తుంటాయి. ఈ కొత్త సంవత్సరంలో ఫార్ములా వన్ రేస్‌ టైటిల్స్‌ను ఎగరేసుకుపోయేందుకు ఫార్ములా వన్ జట్లు సిద్ధమవుతున్నాయి.

గడచిన సంవత్సరంలో తమ ఎఫ్1 కార్లలో తలెత్తిన సమస్యలు మరోసారి తలెత్తకుండా ఉండేలా, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని, రేస్‌కు అనువైన ఏరో డైనమిక్స్‌తో ప్రతి సంవత్సరం తమ కార్లను ఫార్ములా వన్ టీమ్‌లు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వివిధ దేశాలకు చెందిన ఫార్ములా వన్ టీమ్‌లు ఆయా దేశాల్లోనే తమ 2013 ఎఫ్1 కార్లను ప్రదర్శించాయి. ఫెరారీ, రెడ్‌బుల్, సహారా వంటి టాప్ టెన్ ఫార్ములా వన్ జట్ల 2013 ఫార్ములా వన్ కార్లను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-28

మెక్‌లారెన్ ఎమ్‌పి4-28

గడచిన సంవత్సరం క్వికెస్ట్ గ్రిడ్ కారుగా పేరు తెచ్చుకున్న మెక్‌లారెన్ టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోయింది. మెక్‌లారెన్ జట్టు ఎఫ్1 డ్రైవర్లు జెన్సన్ బటన్, సెర్గియో పెరెజ్‌లు ఈసారి మెక్‌లారెన్ ఎమ్‌పి4-28 కారుతో టైటిల్‌పై కన్నేశారు.

సహారా ఫోర్స్ ఇండియా విజేఎమ్06

సహారా ఫోర్స్ ఇండియా విజేఎమ్06

లిక్కర్ దిగ్గజం విజయ మాల్యాకు చెందిన సహారా ఫోర్స్ ఇండియా జట్టు తమ సరికొత్త విజేఎమ్06 ఎఫ్1 కారును ఆవిష్కరించింది. జట్టులో నరేన్ కార్తికేయన్ లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఈసారైనా టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌కు చెందిన సహారా ఫోర్స్ ఇండియా జట్టు ప్రయత్నిస్తోంది.

రెడ్ బుల్ ఆర్‌బి9

రెడ్ బుల్ ఆర్‌బి9

గడచిన సంవత్సరం ఫార్ములా వన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన రెడ్ బుల్ రేస్ సెబాస్టియన్ వెట్టెల్ గుర్తున్నాడా..? ఈసారి కూడా ఈ సరికొత్త రెడ్ బుల్ ఆర్‌బి9 ఫార్ములా వన్ కారుతో రేస్ ట్రాక్‌పై పరుగులు పెట్టేందుకు సదరు టీమ్ సిద్ధంగా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ04

మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ04

ఇదిగో ఇది మెర్సిడెస్ బెంజ్ జట్టు ఫార్ములా వన్ కారు. ఆల్డో కోస్టా, బాబ్ బెల్‌లు ఈ డబ్ల్యూ06 కారును అభివృద్ధి చేశారు. లెవిస్ హామిల్టన్ ఈసారి తమ కొత్త ఫార్ములా వన్ కారుతో టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని యోచిస్తున్నాడు.

లోటస్ ఈ21

లోటస్ ఈ21

2013 ఫార్ములా కార్స్‌లో మొట్టమొదటిగా వచ్చింది లోటస్ ఈ21. ఈ కొత్త లోటర్ ఈ21 ఫార్ములా వన్ కారుతో సదరు టీమ్ డ్రైవర్ కిమి రైక్కోనెన్ రెండవసారి వరల్డ్ ఛాంపియన్‌‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

ఫెరారీ ఎఫ్138

ఫెరారీ ఎఫ్138

ఫెరారీ జట్టు రేస్ డ్రైవర్ ఫిలిప్ మాస్సా ఈ సరికొత్త 2013 ఫెరారీ ఎఫ్138 టైటిల్‌ను దక్కించుకోగలమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

సాబర్ సి32 ఫెరారీ

సాబర్ సి32 ఫెరారీ

సాబర్ జట్టు ఫార్ములా వన్ కారు గడచిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింత భిన్నంగా కనిపిస్తుంది. గ్రే కలర్‌లో ఉండే ఈ సాబర్ సి32 ఫెరారీ కారుతో ఏలాగైనా విజయం దక్కించుకోవాలని సాబర్ సిద్ధమవుతోంది.

స్కుడెరియా టోరో రోస్సో ఎస్‌టిఆర్8

స్కుడెరియా టోరో రోస్సో ఎస్‌టిఆర్8

ఈ సంవత్సరం టైటిల్ దక్కకపోయిన టాప్ 5 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో నిలవాలని టోరో రోస్సో టీమ్ భావిస్తోంది. అందుకు తమ కొత్త ఎస్‌టిఆర్8 ఎఫ్ 1 కారు సహకరించగలదని జట్టు విశ్వసిస్తోంది.

క్యాటర్‌హామ్ సిటి03

క్యాటర్‌హామ్ సిటి03

ఎఫ్1 కార్లలో కెల్లా అందమైన కార్లను తయారు చేసే క్యాటర్‌హామ్ 2013 సంవత్సరానికి తమ సరికొత్త ఎఫ్ 1 కారును ఆవిష్కరించింది.

మారష్యా ఎమ్ఆర్02

మారష్యా ఎమ్ఆర్02

మారష్యా తమ 2013 ఫార్ములా వన్ కారు ఎమ్ఆర్02ను ఆవిష్కరించింది. కొత్త సంవత్సరంలో ఈ కొత్త కారుతో కొత్త రికార్డులను సృష్టించాలని జట్టి భావిస్తోంది.

Most Read Articles

English summary
The 2013 Formula 1 season will be an exciting one. All the 11 teams participating in the 2013 championship have unveiled their cars and have already started the first round of testing. The Formula 1 cars have emerged out of their wind tunnels and have hit the test track.
Story first published: Friday, February 8, 2013, 14:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X