జనవరి 8న 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ విడుదల!

By Ravi

లగ్జరీ కార్ ప్రియులకు కొత్త సంవత్సర కానుకగా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ సరికొత్త 2014 ఎస్-క్లాస్ సెడాన్‌ను జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో సమయంలో విడుదల చేయాలనుకున్న తమ కొత్త అప్‌గ్రేడెడ్ ఎస్-క్లాస్ కారును, అంతకన్నా ముందుగానే జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

జనవరి 8, 2014లో న్యూఢిల్లీ నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ కారు విడుదల కానున్నట్లు సమాచారం. ఈ మోడల్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, మెర్సిడెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎస్-క్లాస్ సెడాన్‌తో పోల్చుకుంటే, దాని కన్నా మరింత మెరుగ్గా, అధునాత ఫీచర్లతో కొత్త 2014 ఎస్-క్లాస్ లభ్యం కానుంది.


మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో ఇదివరకటి ఎస్-క్లాస్ పూర్తిగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇదివరకే తమ కొత్త 2014 క్లాస్ సెడాన్ కోసం ప్రీబుకింగ్‌లు ఓపెన్ చేసిన నేపథ్యంలో, దాదాపు మూడు నెలల సరిపడా 2014 ఎస్-క్లాస్ కార్లు ముందుగానే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే, కొత్త ఎస్-క్లాస్ వెయిటింగ్ పీరయడ్ కూడా గణనీయంగా ఉండే ఆస్కారం ఉంది.
2014 S Class

మెర్సిడెస్ బెంజ్ ఎస్500 లిమిటెడ్ ఎడిషన్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. ఈ మోడల్‌ను నేరుగా జర్మనీ నుంచి ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఇందులో 449 బిహెచ్‌పిల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. దీని ఫెండర్‌పై 'ఎడిషన్ 1' అనే బ్యాడ్జ్ ఉంటుంది. ఇది రెగ్యులర్ ఎస్-క్లాస్ కన్నా అత్యంత విలాసవంతమైనది. మరిన్ని వివరాలు జనవరి 8న తెలిసే అవకాసం ఉంది.
Most Read Articles

English summary
Mercedes-Benz has decided to prepone the launch of its flagship sedan, the 2014 S-Class, in India. The new S-Class luxury sedan, which was earlier scheduled to be launched at the Indian Auto Expo in February 2014, will instead be launched in January.
Story first published: Tuesday, December 17, 2013, 9:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X