కొత్త 2014 టాటా నానోలో పవర్ స్టీరింగ్ ఆప్షన్!

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న 'పీపుల్స్ కారు' టాటా నానోను 'స్మార్ట్ సిటీ కారు'గా మార్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా కొత్త నానో కారులో పవర్ స్టీరింగ్‌తో పాటు మరికొన్ని అధనపు ఇంటెలిజెంట్ ఫీచర్లను జోడించనున్నామని గతంలో ఒకానొక సందర్భంలో టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ వెల్లడించిన సంగతి తెలిసినదే.

అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రస్తుతానికి కేవలం పవర్ స్టీరింగ్ జోడించిన టాటా నానోను అతిత్వరలోనే కంపెనీ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తతం మార్కెట్లో లభిస్తున్న కొత్త నానో కారులో మ్యాన్యువల్ స్టీరింగ్‌కు బదులుగా పవర్ స్టీరింగ్‌ను జోడించి ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఇది విడుదల కావచ్చని సమాచారం.


పవర్ స్టీరింగ్ ఫీచర్ జోడించిన కారణంగా, టాటా నానో కారు ధర రూ.25,000 నుంచి రూ.30,000 వరకు పెరిగే ఆస్కారం ఉంది. ఇదిలా ఉండగా, పూర్తిగా రీడిజైన్ చేయబడిన సరికొత్త నానో మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయం గురించే ఇటీవలే రతన్ టాటా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే.

టాటా నానో మార్కెటింగ్ విషయంలో తప్పు జరిగిందని, దీనిని చవక కారుగా ప్రచారం చేయటం తాము చేసిన తప్పని, అందుకే ఈ తప్పును సరిదిద్దుకునేందుకు సరికొత్త టాటా నానో కారును అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

కాగా.. టాటా మోటార్స్ ఇటీవలే కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కొత్త నానో కారును అప్‌గ్రేడ్ చేసి, 2013 వెర్షన్‌గా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన రెండు గ్లౌ బాక్సులు, 12 వోల్ట్ పవర్‌ సాకెట్‌తో కూడిన రీస్టయిల్డ్ సెంటర్ కన్సోల్, రియర్ పార్సిల్ షెల్ఫ్, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఆంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను జోడించారు.

2013 Tata Nano

అలాగే, కొత్త ఎక్స్టీరియర్ కలర్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ స్ట్రిప్స్‌తో మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా డిజైన్ చేశారు. వెనుక వైపు ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్‌ను జోడించారు. సులువుగా స్టీరింగ్‌ను ఆపరేట్ చేసేలా స్టీరింగ్‌ను, సస్పెన్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మూడు కొత్త ఎక్స్టీరియర్ కలర్స్ (డాజల్ బ్లూ, రాయల్ గోల్డ్, కార్న్‌ఫ్లవర్ బ్లూ)ను జోడించారు.

అయితే, కొత్త నానో బేసిక్ డిజైన్, ఇంజన్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
According to sources, the Tata Motors could launch the new 2014 Tata Nano with power steering option by middle of next month. Stay tuned for more updates.
Story first published: Saturday, December 7, 2013, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X