జూన్ నెలలో 4002 ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ల అమ్మకం

By Ravi

భారత మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదలతో అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా దశ తిరిగింది. గడచిన నెలలో ఫోర్డ్ ఇండియా మొత్తం 8771 వాహనాలను విక్రయించగా, అందులో 4002 యూనిట్లు ఈకోస్పోర్ట్ వాహనాలే ఉన్నాయి.

జూన్ 2013లో ఫోర్డ్ జాతీయ, అంతర్జాతీయ అమ్మకాలు, అందకు ముందు సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 20.46 శాతం వృద్ధి చెంది 8771 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2012లో ఇవి 7281 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదే సమయంలో దేశీయ అమ్మకాలు 6267 యూనిట్ల నుంచి 7145 యూనిట్లకు పెరిగి 14 శాతం వృద్ధిని కనబరచగా, అంతర్జాతీయ అమ్మకాలు 1024 యూనిట్ల నుంచి 1626 యూనిట్లకు పెరిగి 58.78 శాతం వద్ధిని నమోదు చేశాయని కంపెనీ పేర్కొంది.

Ford EcoSport

ఫోర్డ్ ఇండియా విడుదల చేసిన ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లోను పటిష్టమైన వృద్ధిని సాధించటం సాధ్యమైందని కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫీచర్లతో అందిస్తున్న తమ నాణ్యమైన ఉత్పత్తును భారతీయ కొనుగోలుదారులు చక్కగా ఆదరిస్తుండటం వల్లనే ఈ వృద్ధిని సాధించగలిగామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపార్సినియా చెప్పారు.
Most Read Articles

English summary
US based Car maker Ford India reported 20.46 per cent increase in total sales in June this year at 8,771 units. Out of this, 4002 Ford EcoSport SUVs sold in June 2013. The company had sold a total of 7,281 units in the same month last year, Ford India said in a statement.
Story first published: Tuesday, July 9, 2013, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X