900 మహీంద్రా స్కార్పియో ఈఎక్స్ వేరియంట్లు వెనక్కి

By Ravi

భారతదేశపు అతిపెద్ద యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విపణిలో విక్రయించిన 'స్కార్పియో ఈఎక్స్' (Scorpio Ex) వేరియంట్లో సమస్యల కారణంగా, 900 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మహీంద్రా స్కార్పియో ఈఎక్స్ వేరియంట్లలో లోపపూరితమైన ప్రెజర్ రెగ్యులేటింగ్ వాల్స్ సమస్య కారణంగా ఈ వాహనాలను వెనక్కు పిలిపిస్తున్న ఎమ్ అండ్ ఎమ్ తెలిపింది.

అక్టోబర్ 2013 నుంచి నవంబర్ 2013 మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన మహీంద్రా స్కార్పియో ఈఎక్స్ వేరియంట్లలో మాత్రమే ఈ సమస్య ఉందని, ఈ రీకాల్ గురించి కంపెనీ ద్వారా లేదా అధీకృత డీలర్ల ద్వారా వ్యక్తిగతంగా కస్టమర్లకు తెలియజేస్తామని, సదరు వాహనాలను డీలర్‌షిప్/సర్వీస్ సెంటర్లకు తీసుకు వచ్చిన తర్వాత ఈ ఫాల్టీ పార్ట్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ ఓ ప్రటనలో పేర్కొంది.

Mahindra Scorpio

వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు, సేవలను అందించాలనే తమ లక్ష్యంలో భాగంగానే ఈ రీకాల్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. వాహనాల రీకాల్ విషయంలో ఇటీవల భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలను కఠినతరం చేయటంతో, వాహనాల్లో ఏ చిన్నపాటి తయారీ లోపం బయటపడినా, ఆటోమొబైల్ సదరు బ్యాచ్‌కి చెందిన మొత్తం వాహనాలను రీకాల్ చేసి, సమస్యను తనిఖీ చేయాల్సి ఉంటుంది.

గతంలో కూడా మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయించిన పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500'లో ఫ్లూయిడ్ హోస్, ఫ్రంట్ పవర్ విండో, లెఫ్ట్ వైపర్ బ్లేడ్ వంటి సమస్యల కారణంగా 25,000 యూనిట్ల నుంచి 30,000 యూనిట్లను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. ఈ వాహనాలన్నీ కూడా 2001-2012 మధ్య కాలంలో తయారైనవి.

Most Read Articles

English summary
Mahindra has issued a voluntary recall for its Scorpio SUV. The recall affects 900 units of the SUV and only the EX variant. According to Mahindra's official statement the recalled Scorpio EX SUVs will have their potentially faulty pressure regulating valves replaced. These are SUVs which were manufactured between October and November 2013.
Story first published: Friday, December 6, 2013, 11:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X