హోండా అమేజ్ కోసం కొత్త స్కీమ్స్; ఏప్రిల్‌లో విడుదల

By Ravi

ఎంట్రీ-లెవల్ డీజిల్ సెడాన్ సెగ్మెంట్లో అలజడి సృష్టించేందుకు హోండా సిద్ధమైంది. ఇప్పటి వరకూ హోండా డీజిల్ కారు రుచి ఎరుగని తమ వినియోగదారులు పూర్తిస్థాయి విందును అందించేందుకు ఈ జపనీస్ కార్ కంపెనీ ముస్తాబవుతోంది. వచ్చే నెలలో హోండా కార్స్ తమ తొలి డీజిల్ కారు 'హోండా అమేజ్'ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది.

ప్రస్తుతం మార్కెట్లో ప్రధానంగా చర్చించబడుతోంది. ఈ నేపథ్యంలో, హోండా అమేజ్ విడుదల సమయం నాటికి డిమాండుకు తగిన సరఫరాను అందించేందుకు ముందుగానే స్టాక్‌ను సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ మధ్య భాగం నాటికి ఈ కారు మార్కెట్లో విడుదల కానుంది. తాము డీజిల్ కార్ సెగ్మెంట్లోకి ఆలస్యంగా ప్రవేశిస్తున్నప్పటికీ, హోండా అమేజ్ కారుతో మంచి అమ్మకాలు సాధించాలని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇదిలా ఉండగా, హోండా అమేజ్ కోసం కంపెనీ ఇప్పటి నుంచే మార్కెటింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఏ ఏ బ్రాండ్ పాత కారుతోనైనా ఎక్సేంజ్ చేసుకొని తమ అమేజ్ కారును కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ కారుపై రెండేళ్లు లేదా 40,000 కి.మీ. మెయింటనెన్స్ ప్యాకేజ్, అదనపు వారంటీ, క్విక్ సర్వీస్, రోడ్-సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను కూడా హోండా అందించనుంది.

Honda Amaze
Most Read Articles

English summary
Late as it may be in entering the diesel segment in the Indian auto market, Honda is, however, leaving no stone unturned to ensure that its entry level sedan 'Amaze', slated for launch next month, becomes a success.
Story first published: Friday, March 15, 2013, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X