జులై 16న విడుదల కానున్న అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివి

By Ravi

వాణిజ్య వాహనాల తయారీలో అగ్రగామి అయిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్, ఇప్పుడు ప్యాసింజర్ వాహన విభాగంపై కన్నేసింది. ఇప్పటికే తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) ‘దోస్త్'కు మార్కెట్లోకి మంచి సక్సెస్‌ను సాధించడంతో ఈ జేవీ నుంచి మరొక కొత్త బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) 'స్టైల్'ను ఈనెలలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

నిస్సాన్ ఇండియా అందిస్తున్న ఇవాలియా ఎమ్‌పివి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అశోక్ లేలాండ్ తమ స్టైల్ ఎమ్‌పివిని అభివృద్ధి చేస్తోంది. ఇవాలియా, స్టైల్ ఎమ్‌పివిల బేసిక్ డిజైన్ ఒక్కటిగానే ఉన్నప్పటికీ, ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కానీ ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిలో ఉపయోగించిన ఇంజన్‌నే అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌‌పివిలోను ఉపయోగించనున్నారు.

Ashok Leyland Stile

నిస్సాన్ నుంచి పాపులర్ అయిన 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను అశోక్ లేలాండ్ స్టైల్‌ ఎమ్‌పివిలో ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన అశోక్ లేలాండ్ స్టైల్ లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది.

అయితే, ప్రస్తుతం లభిస్తున్న నిస్సాన్ ఇవాలియాలోని ఇంటీరియర్స్ సరిగ్గా లేవని కొనుగోలుదారులు ఈ మోడల్‌ను కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిస్సాన్ తమ ఇవాలియా ఉత్పత్తిని నిలిపివేసి, ఇందులో కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పిలో ఇంటీరియర్స్ ఎలా ఉంటాయో, మార్కెట్లో ఇది ఎలాంటి వాతావరణాన్ని ఎదుర్కుంటో వేచి చూడాల్సి ఉంది.

Most Read Articles

English summary
Country's major commercial vehicle maker Ashok Leyland is going to enter in passenger car market. Ashok Leyland will launch it's most awaited MPV Stile on 16th July.
Story first published: Tuesday, July 9, 2013, 18:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X