సెంచరీ ఎడిషన్ వాంక్విష్‌ను ఆవిష్కరించిన ఆస్టన్ మార్టిన్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'అస్టన్ మార్టిన్' ఇటీవలే 100 వసంతాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న పాపులర్ వాంక్విష్ (డిబిఎస్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్)లో ఓ సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అల్టిమేట్ జిటి కార్ అని పిలువబడే ఈ లగ్జరీ కూపే కారు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. అయితే, ఇలాంటివి కేవలం 100 కార్లను మాత్రమే ఆస్టన్ మార్టిన్ తయారు చేసింది.

సెంచరీ ఎడిషన్ వాంక్విష్ మాదిరిగానే కంపెనీ అందిస్తున్న వి8 వ్యాంటేజ్, డిబి9, మరియు రాపిడే మోడళ్లలో కూడా సెంచరీ ఎడిషన్‌లను అందిస్తున్నామని ఆస్టన్ మార్టిన్ పేర్కొంది. ఈ సెంచర్ ఎడిషన్ వాంక్విష్‌లో కంపెనీ గతంలో ఆఫర్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ హైపర్‌కార్ వన్-77లో (ధర సుమారు రూ.22 కోట్లు) ఉపయోగించిన ప్రీమియం లెథర్ విత్ సిల్వర్ స్టచింగ్‌తో కూడిన ఇంటీరియర్స్‌ను అందిస్తోంది. సీట్ హెడ్‌రెస్ట్‌లపై కూడా ఆస్టన్ మార్టిన్ రెక్కల (వింగ్స్)ను స్పెషల్‌గా సిల్వర్ కలర్ దారంతో ఎంబ్రాడయిరీ చేశారు.

ఈ ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్‌లో ఎక్కువగా సిల్వర్ కలర్ థీమ్‌ను ఉపయోగించటం మనం గమనించవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు, ఇంటీరియర్ లెథర్‌కు సరిపోయేలా లెథర్ కీ పౌచ్‌లతో కూడిన రెండు గ్లాస్ కీలు, ఆస్టన్ మార్టిన్ స్క్రిప్ట్‌ను తెలిపే ధృడమైన సిల్వర్ కఫ్ లింక్స్, సాలిడ్ సిల్వర్ రోలర్ బాల్‌పెన్, బ్యాంగ్ అండ్ ఓలుఫ్సెన్ హెడ్‌ఫోన్స్ మరియు బ్యాడ్జ్‌లను పాలిష్ చేసేందుకు సిల్వర్ పాలిషింగ్ క్లాత్‌లతో కూడిన ఓ ప్రజెంటేషన్ బాక్స్‌ను కూడా ఆస్టన్ మార్టిన్ అందిస్తోంది.

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌


ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్‌లో ఉపయోగించిన శక్తివంతమైన 5.9 లీటర్, వి-12, 48-వాల్వ్ ఇంజన్ గరిష్టంగా 565 బిహెచ్‌పిల శక్తిని, 620 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 195 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఈ సెంచరీ ఎడిషన్ కోసం ఆస్టన్ మార్టిన్ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. దీని ఇతర వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

Most Read Articles

English summary
Aston Martin celebrated its centenary on January 15. To mark the occasion, the car maker unveiled its Centenary Edition Vanquish. Billed by Aston Martin as the “ultimate GT car,” this bespoke version of the luxury coupe will be available worldwide, though only 100 vehicles will be built. The company has also announced that similar centenary editions of the V8 Vantage, DB9 and Rapide are in the offing.
Story first published: Wednesday, January 30, 2013, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X