మార్చ్ 2013లో 10 శాతం పెరిగిన ఆడి ఇండియా సేల్స్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా గడచిన జనవరి నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇదే సమయంలో ప్యాసింజర్ కార్ కంపెనీలు మార్కెట్ మందగమనం కారణంగా అమ్మకాల్లో తగ్గుదలను నమోదు చేస్తుంటే, ఆడి ఇండియా మాత్రం ఇందుకు భిన్నంగా అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే, మార్కెట్ మందగమనం సాధారణ కార్ కంపెనీలపై ప్రభావం చూపగా, లగ్జరీ కార్ కంపెనీలపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదని తెలుస్తోంది.

మార్చ్ 2013లో ఆడి ఇండియా మొత్తం 1,104 యూనిట్లను విక్రయించి అంతకు ముందు సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 10.18 శాతం వృద్ధిని సాధించింది. మార్చ్ 2012లో మొత్తం అమ్మకాలు 1,002 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 15.29 శాతం వృద్ధి చెంది 2,269 యూనిట్ల నుంచి 2,616 యూనిట్లకు పెరిగాయి.

ప్రస్తుతం ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 25 డీలర్‌షిప్ కేంద్రాలుండగా, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 34కు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ ప్రవేశపెట్టిన సరికొత్త ఏడి ఏ4, ఆడి క్యూ3, స్థానికంగా అసెంబ్లింగ్‌ను ప్రారంభించిన ఆడి క్యూ7, ఆడి క్యూ5, ఆడి ఏ6 వంటి కార్లు ఎక్కువగా అమ్ముడుపోయి కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. గతేడాదిలో ఆడి ఇండియా ఐదు కొత్త మోడళ్లను (ఆడి టిటి, సరికొత్త ఆడి ఏ4, ఆడి క్యూ3, ఆడి ఎస్4, ఆడి ఏ8ఎల్ 4.2 టిడిఐ) దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

Audi India Sales
Most Read Articles

English summary
Audi India sales rose 10.18 per cent in March at 1,104 units, the luxury car-maker said in a statement on Monday. The company had sold 1,002 units in the corresponding month last year, it said.
Story first published: Tuesday, April 9, 2013, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X