బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ లకు 'షాక్' ఇచ్చిన ఆడి

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, ఈ సెగ్మెంట్లోని దిగ్గజాలు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియాలకు షాకిచ్చింది. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా బిఎమ్‌డబ్ల్యూ ఇండియాను ఆడి ఇండియా ఓవర్‌టేక్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇదివరకు ఈ సెగ్మెంట్లో ప్రథమ స్థానంలో బిఎమ్‌డబ్ల్యూ ఉండగా, ద్వితీయ స్థానంలో ఆడి మరియు తృతీయ స్థానంలో మెర్సిడెస్ బెంజ్‌లు ఉండేవి.

అయితే, తాజా గణాంకాల ప్రకారం, గడచిన ఆర్థిక సంవత్సరం (2012-13)లో ఆడి ఇండియా తమ అమ్మకాల లక్ష్యాన్ని (8,000 యూనిట్లు) బ్రేక్ చేసి ఏకంగా 9,350 యూనిట్లను విక్రయించి ప్రథమ స్థానాన్ని చేజిక్కించుకోగా, ఇదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కేవలం 8,416 యూనిట్లను మాత్రమే విక్రయించి ద్వితీయ స్థానానికి దిగజారిపోయింది. ఇకపోతే మెర్సిడెస్ బెంజ్ మాత్రం 7,239 యూనిట్లను విక్రయించి తృతీయ స్థానంలో కొనసాగుతుంది.

ఆడి ఇండియా గడచిన సంవత్సరంలో భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో ద్వితీయ స్థానంలో ఉన్న మెర్సిడెస్ బెంజ్‌ను ఓవర్‌టేక్ చేసి ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఇదొక అద్భుతమైన విజయమని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రేస్కీ వ్యాఖ్యానించారు. కాగా, దీనిపై స్పందించేందుకు బిఎమ్‌డబ్ల్యూ అధికారులు నిరాకరించారు.

Audi Number One
Most Read Articles

English summary
Indian Luxury car market is fluctuating continuously. According to sales report in Q1 2013, Audi India comes first by selling 2616 units, Mercedes Benz on 2nd position by selling 2,009 cars and BMW India on 3rd position with 1,465 vehicles sold in India in same period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X