మొదటి రోజునే 125 బుకింగ్‌లు దక్కించుకున్న ఆడి క్యూ3 ఎస్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, సోమవారం మార్కెట్లో విడుదల చేసిన చవక వేరియంట్ ఆడి క్యూ3 ఎస్ మొదటి రోజునే రికార్డు బుకింగ్‌లను సొంతం చేసుకుంది. నిన్న ఒక్క రోజునే ఆన్‌లైన్ ద్వారా ఆడి క్యూ3 ఎస్ వేరియంట్‌కు 125 బుకింగ్‌‌లు వచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. (గతంలో ఆడి క్యూ3 విడుదలైనప్పుడు కూడా మొదటి 5 రోజుల్లోనే 500 బుకింగ్‌లను దక్కించుకున్న సంగతి తెలిసినదే).

ఆడి ప్రారంభించిన ఆన్‌లైన్ బుకింగ్ ప్రాసెస్ ద్వారా ఈ ఫీట్ సాధ్యమైంది. భారత్‌లోని లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న తమకు ఈ ప్రతిస్పందన ఇదివరకు ఊహించినదేనని, ఈ ప్రతిస్పందన తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.

Audi Q3 S

ఇదిలా ఉండగా, ఆడి ఇండియా తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు 'ఆడి క్యూ3 ఎస్' (Audi Q3 S)ను సోమవారం (ఆగస్ట్ 19, 2013) భారత మార్కెట్లో రూ.24.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇది ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నుంచి కొత్తగా మార్కెట్లోకి రానున్న బిఎమ్‌‌డబ్ల్యూ 1-సిరీస్ (సెప్టెంబర్ 3న విడుదల కానుంది) వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు పోటీగా నిలువనుంది.

ఆడి క్యూ3 ఎస్‌లో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిస్టమ్కు బదులుగా ఫ్రంట్ వీల్ డ్రైవ్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజన్తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 142 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆడి క్యూ3 ఎస్ కేవలం 9.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 17.71 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
German luxury car manufacturer Audi India sets a new benchmark in the industry by receiving 125 bookings for the Audi Q3 S Edition on the day of its launch. This continues the success story of the hugely popular Audi Q3, which received 500 bookings within 5 days of its launch in June 2012.
Story first published: Tuesday, August 20, 2013, 12:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X