వరుసగా నాలుగో నెలలోను ఆటో పరిశ్రమ పతనం

ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ ఏడాది అంత పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో కార్లకు పెద్దగా గిరాకీ రావటం లేదు. దీంతో అమ్మకాలు తగ్గి స్టాక్ పెరిగిపోతుంది. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గించుకుంటున్నాయి. సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం రండి..:

ఉత్పత్తి:
మే 2012 నెలలో మొత్తం 18,11,515 వాహనాలు ఉత్పత్తి కాగా, మే 2013 నెలలో 17,37,548 వాహనాలు మాత్రమే ఉత్పత్తి అయ్యి 4.08 శాతం క్షీణతను నమోదు చేసింది.

దేశీయ అమ్మకాలు:
గతేడాది ఏప్రిల్-మే 2013తో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు 0.64 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఇదే సమయంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8.56 శాతం తగ్గాయి. ఈ ప్యాసింజర్ వాహనాల్లో కార్ల అమ్మకాలు 11.3 శాతం తగ్గగా, వ్యాన్ల అమ్మకాలు 10.88 శాతం తగ్గాయి. అయితే, యుటిలిటీ వాహనాలు మాత్రం స్వల్పంగా పెరిగి 4.08 శాతం వృద్ధిని కనబరచాయి.

ఇదే కాలంలో మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా 5.20 శాతం తగ్గాయి. ఇందులో మీడియం, హెవీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 12.11 శాతం తగ్గగా, లైట్ కమర్షియల్ వాహనాలు 1.36 శాతం తగ్గాయి.

త్రిచక్ర వాహనాల అమ్మకాలు స్వల్పంగా 1.47 శాతం పెరగగా, ప్యాసింజర్ క్యారియర్స్ అమ్మకాలు 1.48 శాతం మరియు గూడ్స్ క్యారియర్స్ అమ్మకాలు 1.44 శాతం వృద్ధి చెందాయి.

ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా స్వల్పంగా వృద్ధి చెంది 1.04 శాతం పెరుగుదలను కనబరచాయి. అయితే, ఇందులో టూవీలర్ మోపెడ్లు 11.45 శాతం క్షీణతను నమోదు చేయగా, మోటార్‌సైకిళ్లు 1.38 శాతం తగ్గుదలను కనబరచాయి. కాగా స్కూటర్ల అమ్మకాలు మాత్రం 13.88 శాతం పెరిగాయి.

ఎగుమతులు:
ఏప్రిల్-మే 2013 సమయంలో మొత్తం ఆటోమొబైల్ ఎగుమతులు 8.62 శాతం తగ్గాయి. అయితే, ప్యాసింజర్ మరియు త్రిచక్ర వాహనాల ఎగుమతులు మాత్రం వరుసగా 7.34, 26.53 శాతం వృద్ధి చెందాయి. కాగా, వాణిజ్య మరియు ద్విచక్ర వాహనాలు ఎగుమతులు వరుసగా 19.62, 16.50 శాతం క్షీణించాయి.

Auto Industry Declines For Four Successive Months
Most Read Articles

English summary
Car sales fell an annual 12.3 percent in May, an industry body Siam said on Tuesday, dropping for the seventh straight month, as weak consumer sentiment in a slowing economy continued to weigh on demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X