ఉత్పత్తి దశకు చేరుకోనున్న బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్

బజాజ్ నాలుగు చక్రాల వాహనం 'ఆర్ఈ60' ఉత్పత్తి దశకు చేరువయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడచిన అక్టోబర్ నెలలో బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను పూనే రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తుండగా కెమరాకు చిక్కిన ఫోటోలతో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రచురించిన ఫోటోలలో క్యామోఫ్లేజ్ (టెస్టింగ్ దశలో వాహనాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు అంటించే ఓ రకమైన స్టిక్కర్) కూడిన బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను చూశాం. కాగా.. ఇప్పుడు మరోసారి బజాజ్ ఆర్ఈ60 మహారాష్ట్ర రోడ్లపై కెమెరాకు చిక్కింది. ఈసారి క్యామోఫ్లేజ్ లేని ఆర్ఈ60 ఫోటోలను మా సన్నిహత ఆటో బ్లాగ్ ప్రచురించింది.

గడచిన సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన 2012 అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో తమ మినీ ఫోర్-వీలర్ ఆర్ఈ60 తొలిసారిగా ప్రజలకు పరిచయం చేసింది. ఇందులో ఓ కమర్షియల్ వెర్షన్‌ను (గ్రీన్ కలర్ ఆర్ఈ60) మరొక పర్సనలైజ్డ్ వెర్షన్‌ను (యల్లో కలర్ ఆర్ఈ60) కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ ఆటోలకు ప్రత్యామ్నాయంగా బజాజ్ ఆర్ఈ60 మార్కెట్లోకి రానుంది. ఈ సెగ్మెంట్లోని మాహీంద్రా మ్యాక్సిమో మినీ వ్యాన్, టాటా మ్యాజిక్ ఐరిస్ వంటి మోడళ్లకు ఇది పోటీగా నిలువనుంది.

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60

బజాజ్ ఆర్ఈ60


పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్ కోరుకునే వారికోసం పర్సనలైజ్డ్ ప్రీమియం ఆర్ఈ60ని, వాణిజ్య రవాణా అవసరాల కోసం కమర్షియల్ ఆర్ఈ60ని కంపెనీ ఆఫర్ చేయనుంది. పర్సనలైజ్డ్ ఆర్ఈ60లో అల్లాయ్ వీల్స్, వెనుక వైపు పూర్తి బాడీ ప్యానెల్, ప్రీమియం ఇంటీరియర్స్, సైడ్ విండో గ్లాసెస్, క్లియర్ లెన్స్ హెడ్‌లైట్స్ అండ్ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లతో లభ్యం కానుంది. కమర్షియల్ వెర్షన్ ఆర్ఈ60లో వెనుక వైపు ఫుల్ బాడీ ప్యానెల్‌కు బదులు కర్టెన్, అల్లాయ్ వీల్స్ స్థానంలో సాధారణ వీల్స్, సాధారణ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్‌తో ఇది లభ్యం కానుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది మొదటి త్రైమాసికం నాటికి బజాజ్ ఆర్ఈ60 వాణిజ్య పరంగా లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూనేలో బజాజ్ ప్లాంటులో ఈ ఫోర్-వీలర్ ఉత్పత్తి కానుంది.

Source: IAB

Most Read Articles

English summary
Bajaj RE60 caught again while testing on Pune roads. Bajaja Auto is planning to launch this four wheeler by end of this fiscal. Here are the few spy shots from India Autos Blog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X