బజాజ్ ఆర్ఈ60 విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్

బజాజ్ ఆటో ఫోర్-వీలర్ 'ఆర్ఈ60'కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది. ఇందు కోసం ఆటోమొబైల్ రంగంలో 'క్వాడ్రిసైకిల్స్' అనే కొత్త విభాగాన్ని ప్రారంభించింది. అయితే, ఇది కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని, వీటిని సులువుగా గుర్తించేందుకు 'Q' అనే అక్షరాన్ని ఉపయోగించాలని ప్రభుత్వం పేర్కొంది. సాంప్రదాయ త్రిచక్ర ఆటోరిక్షాలతో పోల్చుకుంటే ఇది మరింత సురక్షితమైనదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ వాహన స్పెసిఫికేషన్లపై తుది డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయాల్సి ఉంది.

బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను తొలిసారిగా గడచిన సంవత్సరంలో జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ప్రస్తుతం కంపెనీ ఈ బజాజ్ ఆర్ఈ60 ఫోర్ వీలర్‌ను తమ ఔరంగాబాద్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది. గడచిన కొద్ది కాలంగా ఈ వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు బజాజ్ ఆటో, భారత ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతున్నాయి. అయితే, కార్ల తయారీ సంస్థలు మాత్రం సేఫ్టీ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వాహనాన్ని విడుదల చేయటాన్ని నిలిపేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Bajaj RE60 Quadricycle

బజాజ్ ఆర్ఈ60లో 200సీసీ పెట్రోల్ ఇంజన్‌ను వెనుక వైపు అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 70 కి.మీ. వేగంతో పరుగులు తీస్తూ, లీటర్ పెట్రోల్‌కు 35-40 కి.మీ. రేంజ్‌లో మైలేజీనిస్తుందని సమాచారం.
బజాజ్ ఆర్ఈ60 కారు ఫీచర్లు:
* 200సీసీ పెట్రోల్ ఇంజన్
* సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది.
* గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.
* ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)
* ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)
* కారు పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.
* కారు మొత్తం బరువు: 400 కేజీలు
* కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు
* లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు
* అంచనా ధర - రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Most Read Articles

English summary
The Government on Wednesday decided to allow manufacturing and plying of a new category of four-wheeler on Indian roads the 'quadricycle'. The decision will pave the way for Bajaj Auto’s RE60.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X