పెబల్ బీచ్‌లో బెంట్లీ లీమ్యాన్స్ లిమిటెడ్ ఎడిషన్ ముల్సాన్

By Ravi

లీమ్యాన్స్ 24 గంటల రేస్ ప్రారంభమై 90 ఏళ్లు పూర్తి కావస్తుండటం, అలాగే 10 ఏళ్లుగా స్పీడ్ 8 రేసు కారులో గెలుపొందిన సందర్భంగా, బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'బెంట్లీ' ప్రత్యేకంగా రూపొందించిన సగం డజను (ఆరు) స్పెషల్ ఎడిషన్ ముల్సాన్ కార్లను మార్కెట్లో విడుదల చేసింది.

ఇందులో కేవలం ఆరు కార్లను మాత్రమే విడుదల చేయటం వెనుక ఆంతర్యం ఏంటంటే, ఈ ఆరు లిమిటెడ్ ఎడిషన్ కార్లు లీమ్యాన్స్ 24 అవర్స్ రేసులో గెలుపొందిన ఆరుగురు దిగ్గజ బెంట్లీ డ్రైవర్లకు గుర్తుగా తయారు చేశారు. సాధారణ బెంట్లీ ముల్సాన్ కార్లతో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ బెంట్లీ ముల్సాన్ కార్లు మరింత విశిష్టంగా ఉండనున్నాయి.


ఈ ఆరు ముల్సాన్ కార్లలో వజ్రాలు పొదిగిన లెథర్ సీట్ కవర్లు, డోర్ ప్యానెళ్లు ఉంటాయి. ఫుట్ పెడల్స్‌ను డ్రిల్డ్-అల్లాయ్‌తో తయారు చేశారు. ఇందులో స్పోర్ట్స్ సస్పెన్షన్, స్టీరింగ్, క్వాడ్ ఎగ్జాస్ట్ పైప్స్, డార్క్ టింటెడ్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ అరుదైన బెంట్లీ ముల్సాన్ కారు ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. పెబల్ బీచ్‌లో వీటిని ఆవిష్కరించనున్నారు. ఈ ఆరు కార్లు, ఆరుగురు డ్రైవర్లకు గుర్తుగా విశిష్టంగా డిజైన్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Bentley Le Mans Limited Edition Mulsanne At Pebble Beach

డ్యూడ్లీ బెంజాఫీల్డ్: ఈ ముల్సాన్ గ్రీన్ కలర్ బాడీ పెయింట్‌ను క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. బెంజాఫీల్డ్ 1927లో లీమ్యాన్స్ 24 అవర్స్ రేసులో గెలుపొందాడు.

ఉల్ఫ్ బర్నాటో: ఈ ముల్సాన్ గ్రానైట్ ఎక్స్టీరియర్, రెడ్ లెథర్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. బర్నాటో 1928 నుంచి 1930 వరకు వరుసగా 3సార్లు విజయం సాధించాడు.

టిమ్ బిర్కిన్: ఈ ముల్సాన్ తెలుపు రంగు ఎక్స్టీరియర్‌ను కలిగి ఉంటుంది. బిర్కిన్ ఒక మాజీ ఫైటర్ పైలట్. 1929లో ఈయన ఉల్ఫ్ బర్నాటోతో పాటుగా విజయం సాధించారు.

గ్లెన్ కిడ్‌స్టన్: ఈ ముల్సాన్ డార్క్ సఫైర్ ఎక్స్టీరియర్‌ను కలిగి ఉంటుంది. కిడ్‌స్టన్ ఒక మాజీ నావల్ ఆఫీసర్. ఈయన 1930లో ఉల్ఫ్ బర్నాటోతో పాటుగా రేసులో గెలుపొందారు.

గయ్ స్మిత్: చివరి బెంట్లీ ముల్సాన్ బెలుగా ఎక్స్టీరియర్‌ను కలిగి ఉంటుంది. స్మిత్ 2003లో స్పీడ్ 8ను నడిపి విజేతగా నిలిచాడు.

Most Read Articles

English summary
In order to mark the 90th anniversary of the Le Mans 24 hour race and the 10th year since it won the last one in a Speed 8 race car Bentley has revealed half a dozen extremely special limited edition Mulsannes. Why half a dozen? It's because each of the six cars pay tribute to six legendary Bentley drivers who brought pride to the company at Le Mans races. As far as the special features go Bentley has done what it does best.
Story first published: Tuesday, August 20, 2013, 14:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X