సెప్టెంబర్ 3న బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, దేశీయ విపణిలో తమ సరికొత్త ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు 'బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్'ను విడుదల చేయనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా సమాచారం ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ తమ కొత్త 1-సిరీస్ కారును సెప్టెంబర్ 3, 2013వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బి-క్లాస్ మరియు ఆడి క్యూ3 వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ గట్టి పోటీగా నిలువనుంది. బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఒక హ్యాచ్‌బ్యాక్, కానీ చూడటానికి క్రాసోవర్ మాదిరిగా ఉంటుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు కన్నా మరింత విశాలంగా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన ఆప్షన్లతో లభ్యం కానుంది.


డీజిల్ వెర్షన్ (118డి) బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్‌లో 2.0 లీటర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది గరిష్టంగా 143 హార్స్ పవర్‌ల శక్తిని, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 24.39 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది (యూరోపియన్ వెర్షన్).

ఇకపోతే పెట్రోల్ వెర్షన్‌ (116ఐ)లో 1.6 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 136 హార్స్ పవర్‌ల శక్తిని, 220 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 18.51 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి. ఇంజన్ పవర్‌ను ఈ ట్రాన్సిమిషన్ ద్వారా వెనుక చక్రాలకు బదిలీ చేయటం జరుగుతుంది.

BMW 1 Series India

భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ధర రూ.22-25 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్లాంటులో ఈ కారును ఉత్పత్తి చేయనున్నారు. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‍‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
Most Read Articles

English summary
BMW's answer to the Mercedes A Class, B Class and Audi Q3, is nearing launch date in India. The 5 door variant of the BMW 1 Series will make its debut here on September 3 and will be offered with a petrol and diesel engine variant.
Story first published: Wednesday, August 7, 2013, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X