చెన్నై ప్లాంటులో బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఉత్పత్తి ప్రారంభం

By Ravi

జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్'ను స్థానికంగా చెన్నై ప్లాంటులో ఉత్పత్తి చేసే ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. చెన్నైకు సమీపంలో ఉన్న మహీంద్రా వరల్డ్ సిటీలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్లాంటులో కంపెనీ అసెంబ్లింగ్ చేసిన మొదటి 7-సిరీస్ లగ్జరీ కారును కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాబెర్ట్ ఫ్రిట్రాంగ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతానికి ఈ ప్లాంటులో డీజిల్ వేరియంట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పెట్రోల్ వేరియంట్లును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుంటున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఈ అప్‌గ్రేడెడ్ 7-సిరీస్ లగ్జరీ కారును ఏప్రిల్ 25, 2013 భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ధరలు రూ.92.90 లక్షల నుంచి రూ.1.73 కోట్ల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). దేశీయ విపణిలో 2013 బిఎమ్‌‌డబ్ల్యూ 7 సిరీస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వాటి వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • బిఎమ్‌‌డబ్ల్యూ 730ఎల్‌డి - రూ. 92.90 లక్షలు
  • బిఎమ్‌‌డబ్ల్యూ 740ఎల్‌ఐ - రూ. 1.12 కోట్లు
  • బిఎమ్‌‌డబ్ల్యూ 750ఎల్‌ఐ - రూ. 1.29 కోట్లు
  • బిఎమ్‌‌డబ్ల్యూ 760ఎల్‌ఐ - రూ. 1.73 కోట్లు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)

BMW 7 Series Production

అప్‌గ్రేడెడ్ బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారులో రివైజ్డ్ ఫ్రంట్ డిజైన్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, మరింత అప్‌రైట్ కిడ్నీ గ్రిల్, ఫుల్ అడాప్టివ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, బూట్‌లిడ్‌పై క్రోమ్ స్ట్రిప్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్లను కూడా అప్‌డేట్ చేయటం జరిగింది. ఈ కొత్త వేరియంట్లలో ఇది వరకటి ఇంజన్లనే రీట్యూన్ చేసి ఉపయోగించారు.

ఈ ఇంజన్ల సామర్థ్యాలలో స్వల్పంగా మార్పులు ఉన్నాయి. 2013 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ డీజిల్ ఇంజన్ సామర్థ్యాన్ని స్వల్పంగా పెంచగా, పెట్రోల్ వెర్షన్ మైలేజీని 21 శాతం మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (8 ఆటోమేటిక్ గేర్లు)తో లభిస్తాయి.

Most Read Articles

English summary
German luxury carmaker BMW India has started the assembling of its newly launched 7-Series luxury saloon. Company has launched the facelift 7 Series in India in last month with the starting price of INR 92.90 lakhs.
Story first published: Thursday, May 30, 2013, 13:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X