ఆగస్ట్ 15 నుంచి పెరగనున్న బిఎమ్‌డబ్ల్యూ, మినీ కార్ల ధరలు

బిఎమ్‌డబ్ల్యూ, మినీ లగ్జరీ కార్లు త్వరలోనే మరింత ప్రియం కానున్నాయి. భారత మార్కెట్లో ఈ రెండు బ్రాండ్ల క్రింద లభ్యమవుతున్న కార్ల ధరలు ఈనెల 15 నుంచి పెరగనున్నాయి. ఆగస్ట్ 15, 2013వతేది నుంచి అన్ని మోడళ్లపై 5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ రోజురోజూకీ పడిపోతుండటమే ఈ పెంపుకు కారణమని తెలుస్తోంది.

ధరల పెంపు విషయంపై బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు ఫిలిప్ వోన్ సాహ్ మాట్లాడుతూ.. భారత మార్కెట్లో స్థిరమైన వృద్ధిని సాధించామని, తమ నాయకత్వపు స్థానాన్ని అలానే కొనసాగించేందుకు మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తామని అన్నారు. దీర్ఘకాలిక దృష్టితోనే తమ ఉత్పత్తులను ధరలను సవరిస్తామని ఆయన అన్నారు.

ఏదేమైనప్పటికీ, కొనుగోలుదారులకు సహకరించేందుకు, వారి డ్రీమ్ బిఎమ్‌డబ్ల్యూ లేదా మినీ కారును సొంతం చేసునేందుకు తమ కంపెనీ ఆకర్షనీయమైన ఫైనాన్స్ సదుపాయాలను కూడా అందిస్తుందని ఫిలిప్ తెలిపారు. బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన ఆర్థిక విభాగం 'బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్' కన్వీనెంట్ అండ్ కస్టమైజ్డ్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, బిఎమ్‌డబ్ల్యూ లీజ్ స్కీమ్ ద్వారా వ్యక్తులు, సంస్థలకు కంపెనీ తమ కార్లను లీజుకు ఇవ్వటం, భారత్‌లోని బీమా భాగస్వాముల ద్వారా ఇన్సూరెన్స్ సదుపాయాలను ఆఫర్ చేయటం కూడా చేస్తుంది.

BMW Mini
Most Read Articles

English summary
German luxury carmaker BMW India has announced a price increase of up to 5 percent across its range of products on sale in India, including Mini cars, effective August 15, 2013.
Story first published: Tuesday, August 6, 2013, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X