ప్రపంచ వ్యాప్తంగా 2.5 లక్షల హోండా కార్ల రీకాల్

By Ravi

Honda Recall
జపనీస్ కార్ కంపెనీ హోండా మోటాక్ కో లి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 250,000 వాహనాలను రీకాల్‌ చేసింది. ఈ వాహనాలలో బ్రేకింగ్ సమస్యలు తెలత్తుతున్న కారణంగా వీటిని వెనక్కు పిలిపిస్తున్నామని, ఇందులో సెడాన్లు, మినీవ్యాన్లు, ఎస్‌యూవీలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కొన్నిసార్లు ఈ కార్లలోని బ్రేకులను నొక్కకుండా ఆటోమేటిక్‌గా బ్రేకులు పడిపోతున్నాయని ఫిర్యాదులు రావటంతో ఈ లోపాలను సరిచేసేందుకు కంపెనీ తాజా రీకాల్‌ను ప్రకటించింది.

అమెరికాతో పాటు మరో ఐదు ఇతర దేశాలలో ఈ రీకాల్‌ను చేస్తున్నామని, ఇందులో అక్యూరా ఆర్‌ఎల్‌ సెడాన్, ఆక్యూరా ఎమ్‌డిఎక్స్‌ క్రాసోవర్ ఎస్‌యూవీ, హోండా పైలెట్‌ ఎస్‌యూవీ మోడళ్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. జపాన్‌లో విక్రయించిన లెజెండ్ సెడాన్, ఒడిస్సీ, ఎలైసియాన్, స్టె‌ప్‌వ్యాగన్ మినీవ్యాన్‌లు కూడా ఈ రీకాల్‌కు వర్తిస్తాయని, ఇవన్నీ 2004-05, 2005-06 సంవత్సరంలో తయారైనవని హోండా ప్రతినిధి టొమోకో టేక్‌మోరీ తెలిపారు.

అయితే, ఈ సమస్య కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదుల జరిగలేదని ఆయన చెప్పారు. కెనడాలో సుమారు 8,000 వాహనాలను ఆస్ట్రేలియాలో 1,000 వాహనాలను, మెక్సికోలు 300 వాహనాలను, జర్మనీలో 70 వాహనాలను రీకాల్‌ చేస్తున్నామని ఆయన చెప్పారు. వాహనం నడిపుతున్న సమయంలో కొన్నిసార్లు ఆటోమెటిక్‌గా బ్రేకులు పడుతున్నట్లు జపాన్‌లో సుమారు 17 ఫిర్యాదులు, అమెరికాలో 1 ఫిర్యాదు రావడంతో ఈ లోపాన్ని సరిచేసేందుకు కంపెనీ రీకాల్‌ను ప్రకటించింది. ఎలక్ట్రానిక్‌ వైరింగ్‌లో లోపం కారణంగా ఈ సమస్య తెలెత్తుతోందని హోండా పేర్కొంది.

Most Read Articles

English summary
Japanese carmaker Honda Motor Co Ltd will recall nearly 250,000 vehicles globally due to braking issues. Seven models are affected by the recall. In the United States and five other countries, the Acura RL sedan, Acura MDX crossover SUV and the Honda Pilot SUV will be recalled. In Japan, the recall will include the Legend sedan and three types of minivans -- the Odyssey, the Elysion, and the Stepwgn.
Story first published: Friday, March 15, 2013, 10:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X