కార్ల కంపెనీలకు కలిసిరాని పండుగ సీజన్

By Ravi

ఈ పండుగ సీజన్ కార్ల కంపెనీలకు ఆశాజనక ఫలితాలను తెచ్చిపెట్టలేకపోయింది. అఖిల భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2012 నెలతో పోల్చుకుంటే అక్టోబర్ 2013లో మొత్తం కార్ల అమ్మకాలు 3.88 శాతం క్షీణించి 1,69,788 యూనిట్ల నుంచి 1,63,199 యూనిట్లకు పడిపోయాయి.

అయితే, ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం జోరందుకున్నాయి. అక్టోబర్ 2012 నెలతో పోల్చుకుంటే అక్టోబర్ 2013లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు (మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు కలిపి) 18 శాతం వృద్ధి చెంది 12,85,015 యూనిట్ల నుంచి 15,16,291 యూనిట్లకు పెరిగాయి.

Car Sales

ఇదే కాలంలో మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు 19.77 శాతం క్షీణించి 66,722 యూనిట్ల నుంచి 53,533 యూనిట్లకు పడిపోయాయి. అన్ని విభాగాలకు చెందిన మొత్తం వాహనాల అమ్మకాలను పరిగణలోకి తీసుకుంటే, అవి 12.56 శాతం వృద్ధిని కనబరచి 16,51,028 యూనిట్ల నుంచి 18,58,386 యూనిట్లకు పెరిగాయి.
Cars
Most Read Articles

English summary
According to the data released by the Society of Indian Automobile Manufacturers (SIAM), Passenger car sales declined by 3.88 per cent to 1,63,199 units in October this year compared to 1,69,788 in the same month of 2012 and motorcycle sales in last month grew by 18.05 per cent to 11,05,103 units from 9,36,122 in the same month previous year.
Story first published: Wednesday, November 13, 2013, 13:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X