రూ.10 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన కార్లపై ఎస్‌యూవీ టాక్స్ వద్దు: ప్రఫుల్ పటేల్

By Ravi

Praful Patel
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన యూనియన్ బడ్జెట్ 2013-14లో పెద్ద ఎస్‌యూవీలపై ఎక్సైజ్ సుంకాన్ని 27 శాతం నుంచి 30 శాతానికి పెంచిన సంగతి తెలిసినదే. అయితే, ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని ఆటోమొబైల్ రంగం ప్రభుత్వాన్ని కోరడంతో, కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. రూ.10 లక్షలకు దిగువన ధర కలిగిన కార్లను 'ఎస్‌యూవీ టాక్స్' నుంచి మినహాయించాలని ఆయన కోరారు.

ఈ విషయం గురించి ప్రఫుల్ పటేల్ ప్రస్తానిస్తూ, ఎస్‌యూవీలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని, మోటార్ వాహన చట్టంలో ఎస్‌యూవీల గురించి సరైన వర్గీకరణ లేకపోవటం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని ఆయన అన్నారు. ఈ పెంపు వలన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రవాణా కోసం ఎక్కువగా ఉపయోగించే టాటా సుమో, మహీంద్రా బొలెరో వంటి వాహనాల ధరలు ప్రభావితమయ్యాయని ఆయన అన్నారు.

ఈ విషయాన్ని ఆర్థికమంత్రి పి చిదంబరం దృష్టికి తీసుకువెళ్లానని, రూ.10 లక్షలకు దిగువన ఉండే ఏ రకమైన వాహనాన్నైనా ఈ ఎస్‍‌‌యూవీ టాక్స్ నుంచి మినహించాలని ప్రతిపాదనలు చేశానని ప్రఫుల్ పటేల్ చెప్పారు. హైఎండ్ లగ్జరీ కార్లను ఉపయోగించే వారికి మాత్రం తప్పనిసరిగా ఈ పెంపును అలానే ఉంచాలి, వారికి సబ్సిడీ డీజిల్‌ను విక్రయించకూడదని అన్నారు. ఎస్‌యూవీలపై విధించిన అధిక సుంకాల విషయాన్ని పునఃపరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కోరటంలో న్యాయం ఉందని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
According to a news report, Heavy industries and public enterprises minister Praful Patel favours vehicles priced below Rs 10 lakh to be exempted from the 'SUV-tax' announced in this year's Budget.
Story first published: Friday, April 5, 2013, 15:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X