అప్‌గ్రేడెడ్ చెవర్లే బీట్‌ను ఖరారు చేసిన జనరల్ మోటార్స్

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ బీట్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. (అక్కడి మార్కెట్లలో ఇది చెవర్లే స్పార్క్ పేరుతో అమ్ముడవుతోంది). ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బీట్ బేసిక్ డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు లేవు.

మరింత ఆకర్షనీయమైన లుక్ అండ్ ఫీల్ కోసం ఎక్స్టీరియర్లు, ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు ఉండనున్నాయి. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొద్దిగా మార్పు చేయబడిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు స్పోర్టీ రియర్ స్పాయిలర్ వంటి మార్పులు ఫేస్‌లిఫ్ట్‌ చెవర్లే బీట్‌లో గమనించవచ్చు. అలాగే ఇంటీరియర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌సిడి స్క్రీన్, కొత్త ప్లాస్టిక్ మెటీరియల్స్, ఆప్షనల్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ (గ్లోబల్ వెర్షన్‌లో) వంటి ఫీచర్లు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Chevrolet Beat

జనరల్ మోటార్స్ తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ చెవర్లే బీట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెడతామని శుభవార్త చెప్పినప్పటికీ, ఇది అంత త్వరగా భారత్‌లోకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. భారత రోడ్లపై ఈ కొత్త బీట్‌ను చూడాలంటే, 2015 వరకు ఆగాల్సిందే అంటున్నారు మార్కెట్ నిపుణులు.

ఫేస్‌లిఫ్ట్ చెవర్లే బీట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ బీట్ 80 బిహెచ్‌పిల శక్తిని, 108 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్ బీట్ 57 బిహెచ్‌పిల శక్తిని, 150 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ బీట్ డీజిల్ వేరియంట్ కూడా 24 కి.మీ. పైగానే మైలేజ్‌ను ఇవ్వనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
There is good news and bad news. General Motors will be launching the next generation Chevrolet Spark (or Beat as we know it). But the facelift will come only in the beginning of 2015, reports Reuters.
Story first published: Wednesday, July 31, 2013, 18:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X