కేవలం 2 నెలల్లో 7,000 బుకింగ్‌లను దక్కించుకున్న సెయిల్

By Ravi

సరసమైన ధరకే మార్కెట్లోకి విడుదలైన చెవర్లే సెయిల్ సెడాన్ కొనుగోలుదారులను చక్కగా ఆకట్టుకుంటోంది. ఇది మార్కెట్లోకి విడుదలైన రెండు నెలల్లోనే 7,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. జనరల్ మోటార్స్ తమ సెయిల్ సెడాన్‌ను గడచిన ఫిబ్రవరి నెలలో కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభం ధరకే మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెయిల్ సెడాన్ హ్యాచ్‌‌బ్యాక్ వెర్షన్ అయిన సెయిల్ యువా మార్కెట్లో మంచి ఆదరణ పొందలేకపోయినప్పటికీ సెడాన్ వెర్షన్ మాత్రం జాక్‌పాట్ కొట్టేసింది.

సెయిల్ సెడాన్ మంచి ఇంటీరియర్ స్పేస్‌ను, బ్యాలెన్స్‌డ్ స్టయిలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించిన మల్టీజెట్ డీజిల్ ఇంజన్ తక్కువ్ ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిలను కలిగి ఉంటుంది. ఇది పరిమాణంలో నాలుగు మీటర్ల కన్నా పొడవును కలిగి ఉన్నప్పటికీ, ధర విషయంలో మాత్రం మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌కు దగ్గర్లో ఉంటుంది. కాబట్టి సెయిల్ సెడాన్ ధరకు తగిన విలువను అందిస్తుంది. ఇందులో రూ.25,000 ధర తగ్గింపుతో ఓ బేస్ వేరియంట్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్

చెవర్లే సెయిల్ సెడాన్


చెవర్లే సెయిల్ సెడాన్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో ఫియట్‌ నుంచి గ్రహించిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌‌ను అమర్చారు ఇది 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

ఆకర్షనీయమైన డిజైన్, స్టయిలిష్ లుక్, ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్లతో ఇది విలాసవంతమైన కారు అనుభూతిని అందిస్తుంది. ప్రమాద పరిస్థితులను తట్టుకునేలా 'సేఫ్ కేజ్' స్ట్రక్చర్‌తో దీనిని తయారు చేశారు. కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు చెవర్లే సెయిల్ సొంతం.

Most Read Articles

English summary
Chevrolet Sail has bagged as many as 7000 bookings with in the just 2 months from its launch. General Motors has launched Chevrolet Sail sedan on 1st February in India at a starting price of 4.99 Lakh ex-showroom Delhi.
Story first published: Thursday, April 4, 2013, 11:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X