త్వరలో మార్కెట్లోకి రానున్న రెనో డస్టర్ ఫోర్-వీల్ డ్రైవ్

By Ravi

ప్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో త్వరలోనే ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన వేరియంట్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం రెనో డస్టర్ కేవలం టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. రెనో ఇండియా ఇప్పటికే తమ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన డస్టర్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచరం.

కాగా, గ్లోబల్ మార్కెట్లో డాసియా బ్రాండ్ కింద అమ్ముడవుతున్న డస్టర్ ఎస్‌యూవీలో ఇప్పటికే ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇటీవలే ముగిసిన జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించిన అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కంపెనీ ఫోర్-వీల్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను ప్రదర్శనకు ఉంచిన విషయం తెలిసినదే. త్వరలోనే మన మార్కెట్లో కూడా విడుదల కానున్న రెనో డస్టర్ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

Dacia Duster

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న రెనో డస్టర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌, డీజిల్ వేరియంట్‌లో 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5లీటర్ డిసిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 13.24 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్స్ లీటరుకు (85 పిఎస్ వెర్షన్) 20.45 కి.మీ. మైలేజీని, (110 పిఎస్ డీజిల్) 19.01 కి.మీ. మైలేజీనిస్తాయి.

రెనో డస్టర్ ఎస్‌యూవీలో 8-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ వ్యూ మిర్రర్స్, కప్‌ హోల్డర్‌తో కూడిన రియర్ సీట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, స్టీరింగ్‌పై ఉండే ఆడియో, ఫోన్ కంట్రోల్స్, సర్దుబాటు చేసుకునేలా ఏర్పాటు చేసిన టిల్ట్ స్టీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, వెనుక సీట్‌లోని ప్యాసింజర్లకు సైతం ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్ మరియు కంట్రోల్స్, వెనుక సీటుల్ ప్యాసింజర్లు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా అమర్చిన 12 వోల్ట్ సాకెట్, 475 లీటర్ల సామర్థ్యం కలిగిన బూట్ స్పేస్, ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే వీలున్న ఫ్రంట్ సీట్ బెల్ట్స్, ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్‌తో కూడిన కీలెస్ ఎంట్రీ సిస్టమ్, డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజ్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ముందువైపు ఏర్పాటు చేసిన ఫాగ్ ల్యాంప్స్, వెనుకవైపు అమర్చిన డిఫాగ్గర్, వైపర్ అండ్ వాషర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, మోనోకాక్వ్ బాడీ (ఛాస్సిస్ మరియు బాడీ రెండు ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మించబడినది), ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్యూయెల్ బ్యారెల్ హెడ్‌ల్యాంప్స్, స్టయిలిష్ రూఫ్ రెయిల్స్, 16 ఇంచ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్, లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, 5.2 మీటర్ల టర్నింగ్ రేడియస్, 205 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఫీచర్లు డస్టర్ సొంతం.

Most Read Articles

English summary
French carmaker Renault India is planning to increase it's flagship SUV Duster range in domestic market. Towards this, Renault India is mulling to launch a four-wheel drive version Duster.
Story first published: Thursday, March 28, 2013, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X