ఆరు నెలల్లో డీజిల్ ధరపై నియంత్రణ ఎత్తివేత: వీరప్ప మొయిలీ

By Ravi

ప్రస్తుతం ప్రతినెలా 50 పైసల చొప్పున పెరుగుతున్న డీజిల్ ధరలు మరో ఆరు నెలలో తర్వాత ఏక మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. రానున్న ఆరు నెలల్లో డీజిల్ ధరలకు పూర్తిగా స్వేచ్ఛ (డీరెగ్యులేట్) కల్పిస్తామని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించారు. ప్రస్తుతం డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టం లీటరుకు రూ.9.28 మేర ఉంటోందని కేపీఎంజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.

డీజిల్ విక్రయంపై నష్టం ఉన్నప్పటికీ, ధరను ఒక్కసారిగా రూ.3 లేదా రూ.4 చొప్పున పెంచే యోచనేదీ లేదని, స్వల్ప పెరుగుదల క్రమంగానే కొనసాగుతుందని మొయిలీ వివరించారు. ప్రస్తుత పెరుగుదలను బట్టి చూస్తే డీజిల్‌పై చమురు కంపెనీల తమ నష్టాలు భర్తీ చేసుకునేందుకు 19 నెలలు పడుతుందని అంచనా. అయితే, రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఆరు నెలల కాలం సరిపోవచ్చని భావిస్తున్నట్లు మొయిలీ చెప్పారు.

Diesel

త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా డీజిల్ డీరెగ్యులేషన్ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఉత్పత్తి వ్యయాల కన్నా తక్కువగా ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే డీజిల్‌ని విక్రయిస్తున్నాయి. ఫలితంగా, చమురు సంస్థలకు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. ఇలా ఇప్పటికే ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికమవుతోంది. ఈ భారం నుంచి పూర్తిగా తప్పించుకునే సర్కారు మరో ఆరు నెలల్లో ఈ నిర్ణయం తీసుకోనుంది.
Most Read Articles

English summary
Diesel prices will be deregulated in six months with gradual price increases, Oil Minister M Veerappa Moily said.
Story first published: Saturday, November 23, 2013, 13:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X