నిస్సాన్ డీలర్‌‌షిప్‌ల ద్వారా డాట్సన్ కార్ల విక్రయం

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా ఇటీవలే 30 ఏళ్ల తర్వాత పునఃప్రవేశపెట్టిన తమ పురాతన కార్ బ్రాండ్ 'డాట్సన్' క్రింద తక్కువ ధర కలిగిన కార్లను కంపెనీ విక్రయించున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే డాట్సన్ బ్రాండ్‌లో గో హ్యాచ్‌బ్యాక్, గో ప్లస్ ఎమ్‌పివిలను ఆవిష్కరించిన నిస్సాన్, ఈ కార్లను 2014 ఆరంభంలో వాణిజ్య పరంగా భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో, కార్లను నిస్సాన్ మోటార్ ఇండియా ప్రారంభంలో భాగంగా తమ డాట్సన్ కార్లను, ప్రస్తుతం భారత్‌లో తమకు ఉన్న నిస్సాన్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారానే విక్రయించాలని యోచిస్తోంది. అంటే, దేశంలోని ప్రతి నిస్సాన్ ఇండియా అవుట్‌లెట్‌లో డాట్సన్ కార్లు కూడా లభ్యమవుతాయన్నమాట. ఈ రెండు మోడళ్లలో ముందుగా డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి రానుంది.


చెన్నైలో ఉన్న రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో డాట్సన్ కార్లను కూడా ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడి మార్కెట్లో ఉత్పత్తి చేసిన డాట్సన్ కార్లను కంపెనీ పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది. నిస్సాన్ మోటార్ ఇండియా ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం డాట్సన్ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా అవుట్‌లెట్లను ఏర్పాటు చేయటం అసాధ్యమైన విషయం. ఇందుకు అనేక కారణాలున్నాయి.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఉదాహరణకు, డాట్సన్ బ్రాండ్ క్రింద ఉత్పత్తులు తక్కువగా ఉండటం, అంతేకాకుండా ఈ బ్రాండ్‌కు ఇండియన్ మార్కెట్ నుంచి ఎలాంటి స్పంధన లభిస్తుందో తెలియకపోవటం మొదలైనవి. అయితే, భవిష్యత్తులో డాట్సన్ కార్లు పాపులారిటీని దక్కించుకొని, వీటి ప్రోడక్ట్ పోర్ట్‌‌ఫోలియో అధికమైన సందర్భంలో, నిస్సాన్ ఇండియా డాట్సన్ కోసం ఎక్స్‌క్లూజివ్ అవుట్‌లెట్లను ప్రారంభించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Datsun Go Plus

డాట్సన్ గ్లోబల్ హెడ్ విన్సెంట్ కోబీ మాట్లాడుతూ.. డాట్సన్ గో కారును అలాగే భవిష్యత్తులో డాట్సన్ నుంచి వచ్చే మోడళ్లను భారత్‌లోని నిస్సాన్ మోటార్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించడమే ఉత్తమంగా ఉంటుందని, ఎందుకుంటే నిస్సాన్ ఇప్పటికే భారత్‌లో భాగా గుర్తించబడుతున్న బ్రాండ్ కావటం వలన, ఈ డీలర్‌షిప్‌లలో డాట్సన్ కార్లను విక్రయించడం వలన వాటికి కూడా అంతే మంచి ఆదరణ లభించగలదని అన్నారు.
Most Read Articles

English summary
The first model from Nissan's Datsun brand, the Go hatchback, will be launched at the Auto Expo in Feb, 2014 and the new budget car should hit the roads in the next few weeks.
Story first published: Tuesday, November 26, 2013, 14:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X