బ్రేకింగ్ న్యూస్: ఆల్టోకి పోటీగా మరో డాట్సన్ చీప్ కారు

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కు భారత ఆటోమొబైల్ మార్కెట్‌పై కన్ను పడింది. శరవేగంగా విస్తరిస్తున్న భారత ఆటోమొబైల్ మార్కెట్లోని అవకాశాలను అత్యంత త్వరగా అందిపుచ్చుకునేందుకు కంపెనీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో, చరిత్రలో కలిసిపోయిన తమ పురాతన ఆటోమొబైల్ బ్రాండ్ 'డాట్సన్' తిరిగి తీసుకొచ్చిన నిస్సాన్, ఇప్పుడు ఈ బ్రాండ్ క్రింద అత్యంత తక్కువ ధరకే ఉత్పత్తులను అందించి, కస్టమర్లను కైవశం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది.

డాట్సన్ నుంచి రెండు ఉత్పత్తులు (గో హ్యాచ్‌బ్యాక్, గో ప్లస్ ఎమ్‌పివి) వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానున్న సంగతి తెలిసినదే. అయితే, తాజాగా.. డాట్సన్ బ్రాండ్ క్రింద మరో ఎంట్రీ లెవల్ కారును (గో హ్యాచ్‌బ్యాక్ కాకుండా) విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Datsun

నిస్సాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘవంశి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాము త్వరలో విడుదల చేయనున్న గో హ్యాచ్‌బ్యాక్ కారుకు దిగువన ఓ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ కారును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని చెప్పారు. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారునే కంపెనీ రూ.3-4 లక్షల రేంజ్‌లో అందించాలని చూస్తోంది. అలాంటిది గో హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన రానున్న ఈ కారు ధర రూ.2-3 లక్షల లోపే ఉండే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈ కారును ఐ2 అనే కోడ్ నేమ్‌తో తయారు చేస్తున్నట్లు సమాచారం.

డాట్సన్ నుంచి రానున్న గో హ్యాచ్‌బ్యాక్ ఈ సెగ్మెంట్లో నేరుగా ఆల్టో కె10 మోడల్‌ను సవాల్ చేయనుండగా, ఐ2 హ్యాచ్‌బ్యాక్ నేరుగా ఆల్టో 800తో తలపడనుంది. ఇది ఈ ఎంట్రీ లెవల్ డాట్సన్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి రావటానికి మరో ఏడాది సమయం పట్టొచ్చని అంచనా. ఈ లోపుగా డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్, గో ప్లస్ ఎమ్‌పివిలకు మధ్యలో ఓ కాంపాక్ట్ సెడాన్‌ను కూడా విడుదల చేయనుంది. ఈ మోడలను తొలిసారిగా రష్యా మార్కెట్లో ఆవిష్కరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

Most Read Articles

English summary
Nissan India vice president, Ajay Raghuvanshi has revealed to FT that the third Datsun model will be an entry level hatchback, placed below Go. While the Go hatchback will be placed in the INR 3-4 lakh price range, the sub-Go hatchback, known by its internal code-name ‘l2', will fall in the 2-3 lakh price bracket.
Story first published: Thursday, December 19, 2013, 18:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X