కార్ల గురించి కొన్ని ఆసక్తికరమైన సత్యాలు (కార్ ఫ్యాక్ట్స్)

మన దైనందిన జీవితంలో కార్లు కూడా ఓ భాగమైపోయాయి. ఒకప్పుడు కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితం అయిన కార్లు, ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే కార్లు లభిస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు కూడా తమ కారు కలను నిజం చేసుకోగలుగుతున్నారు. సౌకర్యవంతమైన, సురక్షితమైన వ్యక్తిగత రవాణా ప్రయోజనాల కోసం కార్లు ఎంతో చక్కగా ఉపయోగపడుతాయి.

దశాబ్ధాల కాలంగా కార్లు ఎన్నో రూపాంతరాలు చెందుతూ వచ్చాయి. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, విభిన్న ఆకృతులలో, విభిన్న పరిమాణాలతో కార్లు అందుబాటులో ఉన్నాయి. కార్ల గురించి అనేక సత్యాలే ఉన్నాయి. అందులో కొన్నింటిని ఈ కథనం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాము. చదివి తెలుసుకోండి..!

కారు ఎయిర్‌బ్యాగ్స్

కారు ఎయిర్‌బ్యాగ్స్

ఎయిర్‌బ్యాగ్‌లకు స్పీడ్ అంటే ప్రేమ ఎక్కువ. వేగంగా వెళ్తున్న కారు ఏదైనా వస్తువును/వాహనాన్ని ఢీకొట్టినప్పుడు కారు ఎయిర్ బ్యాగ్ విచ్చుకోవటానికి ఎంత సమయం పడుతుందో తెల్సా.. కేవలం 40 మిల్లీసెకండ్లు మాత్రమే (1 సెకండులో 1000 మిల్లీసెకండ్లు ఉంటాయి). అంటే, మన కనురెప్ప మూసి ఆర్పే సమయం కన్నా కూడా ఎన్నోరెట్లు తక్కువ వేగంలోనే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకుని కారులోని ప్రయాణికులను ప్రమాదం నుంచి రక్షిస్తుంది.

అమెరికాలో మొట్టమొదటి జపనీస్ కారు

అమెరికాలో మొట్టమొదటి జపనీస్ కారు

అగ్రరాజ్యమైన అమెరికాలో మొట్టమొదటిగా విడుదలైన జపనీస్ కారేంటో తెలుసా.. హోండా అకార్డ్. నవంబర్ 1982లో హోండా తొలిసారిగా అమెరికాలో అకార్డ్ కారును ప్రవేశపెట్టింది. దీంతో ఇది అమెరికాలో తొలి జపనీస్ కారుగా రికార్డు దక్కించుకుంది.

పోర్షే 911 ఎప్పుడు పుట్టింది?

పోర్షే 911 ఎప్పుడు పుట్టింది?

ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన పోర్షే 911 కారును తొలిసారిగా 1964వ సంవత్సరంలో పరిచయం చేశారు. అప్పట్లోనే ఇది అత్యంత శక్తివంతమైన కార్లలో ఒకటిగా నిలిచింది. 1964లో విడుదలైన పోర్షే 911 కారు గరిష్టంగా 130 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసేది.

చెవర్లే ఇంపాలా ఫీవర్

చెవర్లే ఇంపాలా ఫీవర్

చెవర్లే ఇంపాలా ఎగ్జిక్యూటివ్ సెలూన్ అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. 1965లో 10 లక్షల చెవర్లే ఇంపాలా కార్లు అమ్ముడుపోయి రికార్డు బ్రేకింగ్ సేల్స్ నమోదు అయ్యాయి.

రోజుకు 14 ఫెరారీ కార్లు మాత్రమే

రోజుకు 14 ఫెరారీ కార్లు మాత్రమే

ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ ఫెరారీ రోజుకు గరిష్టంగా 14 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

మోటార్ ఇన్సూరెన్స్ సీక్రెట్

మోటార్ ఇన్సూరెన్స్ సీక్రెట్

ఆటో ఇన్సూరెన్స్ పాలసీ ఇటీవల పుట్టిందేమి కాదు. దీనికి 1897లోనే బీజం పడింది. మొట్టమొదటి ఆటో ఇన్సూరెన్స్ పాలసీ 1897లో మస్సాచుస్సెట్స్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌లో కొనుగోలు చేయబడినది.

వైపరన్ కనుగొన్నది ఎవరు..?

వైపరన్ కనుగొన్నది ఎవరు..?

వర్షాకాలం, శీతాకాలం సమయాల్లో రోడ్డు స్పష్టంగా కనిపించేందుకు కారణమైన వైపర్లను కనుగొన్నది ఓ మహిళ. 1903వ సంవత్సరంలో మేరీ ఆండర్సన్ అనే ఆమె కార్ వైపర్లను తొలిసారిగా పరిచయం చేసింది. అప్పట్లో కారు డ్రైవర్లు వర్షాకాల సమయంలో విండ్‌షీల్డ్‌ను తొలగించి కారు నడపాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గమనించిన ఆండర్సన్ రబ్బర్ బ్లేడ్‌తో కూడిన స్వింగింగ్ ఆర్మ్‌ను కనుగొంది. అప్పట్లో ఈ పరికరాన్ని డ్రైవర్లు కారు లోపల ఉండే ఓ లివర్ సాయంతో ఉపయోగించే వారు. ఆ తర్వాత 1916 నుంచి అన్ని అమెరికన్ కార్లలో వైపర్లు స్టాండర్డ్‌గా మారిపోయాయి.

మొట్టమొదటి ఫోర్ స్ట్రోక్ ఇంజన్

మొట్టమొదటి ఫోర్ స్ట్రోక్ ఇంజన్

ద్విచక్ర వాహనాల్లో అత్యంత పాపులర్ అయిన ఫోర్ స్ట్రోక్ ఇంజన్లను తొలిసారిగా ఎవరు కనుగొన్నారో తెలుసా..? జర్మనీకు చెందిన ఓట్టో అండ్ లాంగెన్ అనే కంపెనీ తొలి ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను 1876లో ఉత్పత్తి చేసింది.

నీటి ఆవిరితో నడిచే కారు

నీటి ఆవిరితో నడిచే కారు

నికోలస్ కగ్నాట్ 1769లోనే నీటి ఆవిరితో నడిచే కారును కనుగొన్నారు. ఈ కారును మొదటిసారిగా ఫ్రెంచ్ ఆర్మీ ఫిరంగులను తరలించేందుకు ఉపయోగించింది. ఈ కారుకు ముందు వైపు పెద్ద బాయిలర్ ఉంటుంది. ఈ బాయిలర్ ద్వారా వచ్చే నీటి ఆవిరితో కారు ముందుకు నడుస్తుంది (పాత కాలపు ఓడల మాదిరిగా). దీని గరిష్ట వేగం గంటకు 6 కి.మీ. మాత్రమే.

మేడ్ ఇన్ ఇండియా టాటా నానో

మేడ్ ఇన్ ఇండియా టాటా నానో

ఈ ఆసక్తికరమైన సత్యాల్లో మన దేశంలో తయారైన టాటా నానో కారు కూడా చోటు దక్కించుకుంది. ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా నానో చరిత్ర సృష్టించింది. టాటా నానో విడుదలైన సమయంలో ఈ కారు ధర కేవల లక్ష రూపాయలు మాత్రమే. ఇప్పుడు దీని ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

మీకేవైనా కార్ల గురించిన సత్యాలు తెలుసా?

మీకేవైనా కార్ల గురించిన సత్యాలు తెలుసా?

ఈ కథనంలో పేర్కొన్నవి కాకుండా, మీకేవైనా కార్ ఫ్యాక్ట్ తెలిసి ఉంటే మాతో పంచుకోండి. వాటిని మీ ద్వారా మా పాఠకులకు తెలియజేస్తాం.

Most Read Articles

English summary
Cars have always hypnotized the car-slave. We are not gasconading that we are the ultimate Car Guru's in your vicinage, after all we know a bit or two about cars! Right there we wish to stop bragging and get to our latest discussion which is crazy car facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X