లీటరు ఇంధనంతో వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించే కారు

By Ravi

టైటిల్ చూసి ఇదేదో ఏప్రిల్ ఫూల్ న్యూస్ అనుకోకండి. ఇది అక్షరాల నిజం. దుబాయ్‌లోని ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం ఓ అద్భుతమైన కారును అభివృద్ధి చేస్తోంది. ఈ కారు లీటరు ఇంధనంపై 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు రూపొందించిన తక్కువ బరువు కలిగిన కారుకు 'ఎకో-దుబాయ్ 1' అనే పేరును పెట్టారు.

ప్రస్తుతం ఈ కారు నిర్మాణం తుది దశలో ఉందని, మరో రెండు వారాల్లో దీనిని టెస్టింగ్ చేస్తామని వారు తెలిపారు. హైయర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ దుబాయ్ మెన్స్ కాలేజ్‌కు చెందిన విద్యార్థులు దాదాపు రెండేళ్లు శ్రమించి ఈ కారును రూపొందించారు. ఈ వాహనం అర్థ మీటరు వెడల్పును, రెండు మీటర్ల వెడల్పను కలిగి ఉండి దాదాపు 25 కేజీల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా రూపొందించిన కార్లతో ఇది జులై రేస్‌కు దిగనుంది. ఈ విద్యార్థుల బృందంలో ఒకరైన అహ్మద్ ఖాసిమ్ ఆల్ సువైది మాట్లాడుతూ.. పెట్రోల్ ఎంతో కాలం ఉండబోదని, ఏదో ఒక రోజు అది పూర్తిగా అంతరించిపోతుందని, అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కారును తయారు చేశామని, ఈ విషయంలో యూఏఈ భవిష్యత్తు తామేనని పేర్కొన్నాడు.

కౌలాలంపూర్‌లో జులై 4-7 వరకూ జరగనున్న షెల్ ఎకో-మారథాన్‌లో విద్యార్థులు తమ కారును రేస్‌కు ఉంచనున్నారు. ఒక లీటరు ఇంధనంతో ఎవరి కారు ఎక్కువ ప్రయాణిస్తుందో అదే ఈ మారథాన్‌లో విజేతగా నిలుస్తుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యార్థులు ఎలక్ట్రిసిటీ, సోలార్, హైబ్రిడ్ టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Car
Most Read Articles

English summary
A team of engineering students in the UAE have designed a car that could potentially travel up to 1,000 km on just one litre of fuel. The lightweight vehicle - named Eco-Dubai 1 - is in its final stage of construction and will begin testing in the next two weeks.
Story first published: Thursday, April 4, 2013, 18:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X