బడ్జెట్ తర్వాత చవకగా మారనున్న ఎలక్ట్రిక్ వాహనాలు

By Ravi

కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటే, మీ ప్లాన్‌ను మరికొంత కాలం వాయిదా వేసుకోండి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు మరియు ద్విచక్ర వాహనాలను కొనుగోళ్లను ప్రత్సహించేందుకు అమెరికా, బ్రిటన్ వంటి కంపెనీలు సదరు కార్లపై భారీ మొత్తాలలో ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా కూడా ఈ దేశాల సరసన చేరిపోనుంది. అసలు విషయం ఏంటంటే, భారత్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను ఈ ఏడాది యూనియన్ బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేయనుంది.

ఇదే గనుక జరిగితే, ఏప్రిల్ నెల నుంచి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆఫర్ చేయనున్న ఈ ప్రోత్సాహకాల విలువ సాలీనా రూ.300 నుండి రూ.500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ సబ్సిడి అమల్లోకి వచ్చినట్లయితే, ఎలక్ట్రిక్ బైక్‌ల ధర రూ.50,000 మరియు ఎలక్ట్రిక్ కార్ల ధర రూ.1.50 లక్షలకు దిగివచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రతిపాదన అమలైతే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలైన మహీంద్రా రేవా, హీరో ఎలక్ట్రిక్ వంటి పలు కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. ఈ ప్రతిపాదన నేపథ్యంలో, మహీంద్రా రేవా తమ ఫోర్ సీటర్ ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ (రేవా ఎన్ఎక్స్ఆర్) విడుదలను వాయిదా వేస్తూ వస్తోంది. జనవరి 9న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల కోసం నేషనల్ మిషన్ ప్లాన్‌ను ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రణాళికను 2011 బడ్జెట్‌లోనే వెల్లడి చేయటం జరిగింది.

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్


ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రమోట్ చేయటం కోసం భారత్ 2020 నాటికి రూ.22,500 కోట్లను వెచ్చించనుంది. ఈ మొత్తంలో రూ.13,000-14,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుండగా, మిగిలిన మొత్తాన్ని ఆటో పరిశ్రమ వెచ్చించనుంది. 2020 నాటికి దేశీయ రోడ్లపై 70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు సంచరించవచ్చని అంచనా. 2011-12 సమయంలో మొత్తం 1,30,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వెల్లడి చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి.

Most Read Articles

English summary
The Indian government is planning to offer subsidies to electric vehicles in the upcoming budget to encourage people to buy them. Electric vehicles will be cheaper from April as the total subsidy on such vehicles will be up to Rs.500 crores.
Story first published: Friday, January 4, 2013, 18:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X