యూనియన్ బడ్జెట్ 2013-14లో ఆటో రంగానికి ఒరిగిందేంటి?

ఈ బడ్జెట్‌లోనూ ఆటో రంగానికి బాదుడు తప్పలేదు. కేంద్ర సర్కారు నేడు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో ప్రభుత్వం ఆటో రంగానికి వాత పెట్టి వెన్న రాసింది. పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి చిదంబర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ హైలైట్స్ ఇలా ఉన్నాయి:

బ్యాడ్ న్యూస్:

  • రోడ్లపై, పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే పెద్ద ఎస్‌యూవీలపై (4 మీటర్ల కన్నా పొడవు ఉండేవి) ఎక్సైజ్ సుంఖాన్ని 27 శాతం నుంచి 30 శాతం పెంచింది.
  • ఇంపోర్టెడ్ వాహనాలు మరింత కాస్ట్లీ: విదేశాల నుండి దిగుమతి చేసుకునే దేశీయ విపణిలో విక్రయించే వాహనాలపై దిగుమతి సుంఖాన్ని 75 శాతం నుంచి 100 శాతానికి, 800సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంపోర్టెడ్ మోటార్‌సైకిళ్లపై సుంఖాన్ని 60 శాతం నుంచి 75 శాతానికి పెంచడం జరిగింది.

గుడ్ న్యూస్:

  • టాక్సీలుగా రిజిస్టర్ చేసుకునే ఎస్‌యూవీలకు మాత్రం ఎక్సైజ్ సుంఖం నుండి మినహాయింపు లభిస్తుంది.
  • హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లపై ఎక్సైజ్ సుంఖం మినహాయింపును 31.03.2015 వరకూ పొడగించటం జరిగింది.
  • దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఎలాంటి పెంపు లేదు.

ఎవరికి నష్టం..?
* అయితే, మహీంద్రా బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ500, టొయోటా ఫార్చ్యూనర్, రెనో డస్టర్, టాటా సఫారీ స్టోర్మ్, ఫోర్డ్ ఎండీవర్, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ మొదలైన ఎస్‌యూవీల ధరలు భారీగా పెరుగుతాయి. (ఇన్నోవా, ఎర్టిగా, జైలో వంటి ఎమ్‌యూవీ / ఎమ్‌పివిలకు ఈ పెంపు వర్తిస్తుందో లేదో తెలియాల్సి ఉంది).
* దిగుమతి సుంఖం పెంపుతో మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, పోర్షే, లాంబోర్గినీ, బెంట్లీ, రోల్స్ రాయిస్, వోల్వో మొదలైన కార్ కంపెనీలు అందిస్తున్న కార్ల ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి.
* మోటార్‌సైకిళ్లపై కూడా దిగుమతి సుంఖాన్ని పెంచడంతో (800సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగినవి) హ్యార్లీ డేవిడ్‌సన్, డ్యుకాటి, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, హ్యోసంగ్, ట్రైయంప్ తదితర ద్విచక్ర వాహన కంపెనీలు అందిస్తున్న టూవీలర్ల ధరలకు రెక్కలు రానున్నాయి.

ఎవరికి లాభం..?
* ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే మహీంద్రా రేవా వంటి కంపెనీలు లబ్ధి పొందనున్నాయి.
* ఎస్‌యూవీలను సిటీ టాక్సీలుగా రిజిస్టర్ చేసుకునే వినియోగదారులు లబ్ధి పొందనున్నారు.
* ఎస్‌యూవీలపై తాజాగా ఎక్సైజ్ సుంఖం పెంపు పెద్ద ఎస్‌యూవీలకు మాత్రమే (4 మీ. కన్నా పొడవు ఉన్నవి) వర్తిస్తుంది కాబట్టి, మహీంద్రా క్వాంటో, ప్రీమియర్ రియో, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలు లబ్ధి పొందుతాయి.
* విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేసే కార్, మోటార్‌సైకిల్ కంపెనీలు లబ్ధి పొందుతాయి.

Budget
Most Read Articles

English summary
Budget 2013-14 Highlights: Excise duty has been increased on Sports Utility Vehicles (SUVs) from existing 27% to 30%. However, the hike won't be applicable on the SUVs registered as taxis. Import duty has increased from 75% to 100%, on completely built units (CBUs) and 60% to 75% on above 800cc imported bikes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X