ఫియట్ క్రైస్లర్ నుంచి భారత్‌కు తొమ్మిది మోడళ్లు

By Ravi

ప్రముఖ ఆటోమొటివ్ గ్రూఫ్ ఫియట్ క్రైస్లర్ భారత్‌లో తన మార్కెట్ వాటాను విస్తరించుకునే దిశగా సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, రానున్న మూడేళ్లలో తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవటంతో పాటుగా తొమ్మిది కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

'విస్తరణ ప్రణాళికలో భాగంగా తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందులో కొన్ని రిఫ్రెష్డ్ మోడల్స్, కొన్ని కొత్త మోడల్స్ ఉంటాయ'ని ఫియట్ క్రైస్లర్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేష్ బసవన్‌హల్లి తెలిపారు. కంపెనీ ఈ ఏడాది నుంచే కొత్త ఉత్పత్తులను విడుదల చేయటం ప్రారంభిస్తుందని, మరో మూడేళ్ల పాటు ఇది కొనసాగుతుందని ఆయన చెప్పారు.

Fiat Chrysler

ఫియట్ మోడళ్లతో పాటుగా క్రైస్లర్, అబార్త్ బ్రాండ్ మోడళ్లను కూడా విడుదల చేయనున్నామని బసవన్‌హల్లి తెలిపారు. క్రైస్లర్ నుంచి పాపులర్ అయిన ఐకానిక్ జీప్ మోడళ్లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసినదే. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం చివరి త్రైమాసికంలో జీప్ మోడళ్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో తమకు 1 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటా ఉందని, ఈ వాటాను రానున్న మూడేళ్లలో ప్రతి ఏటా రెట్టింపు చొప్పున పెంచుకుంటామని ఆయన తెలిపారు. మిడ్-సైజ్ సెడాన్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లతో పాటుగా ఎస్‌యూవీ విభాగంలోని వృద్ధిని కూడా అందిపుచ్చుకోవాలని కంపెనీ యోచిస్తోదని బసవన్‌హల్లి వివరించారు.

Most Read Articles

English summary
Automotive group Fiat Chrysler is looking to enhance its market share in India on the back of launches of nine models and expansion of sales and service network in the next three years.
Story first published: Monday, August 12, 2013, 13:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X