కొత్త లీనియా క్లాసిక్‌ను విడుదల చేయనున్న ఫియట్

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా నుంచి నేడు (సెప్టెంబర్ 25, 2013) ఓ కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది. సి-సెగ్మంట్ సెడాన్ విభాగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని, తక్కువ ధర కలిగిన సెడాన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, ప్రస్తుతం ఫియట్ అందిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్, లీనియా సెడాన్లకు మధ్యలో ఓ చవక రకం సెడాన్‌ను ఫియట్ విడుదల చేయనుంది.

'ఫియట్ లీనియా క్లాసిక్' (Fiat Linea Classic) పేరుతో విడుదల కానున్న ఈ కొత్త సెడాన్ ధరను తక్కువగా ఉంచేందుకు, ఇందులో కొన్ని ప్రముఖ ఫీచర్లను తొలగించనున్నారు. 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ స్థానంలో 14 ఇంచ్ వీల్స్, బ్లాక్ కలర్ డ్యాష్‌బోర్డ్ (పుంటో మాదిరిగా) వంటి మార్పులు ఉండనున్నాయి. ఇందులో స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్‌ను తొలగించనున్నారు. ఈ ఫీచర్లను తగ్గించడం వలన ఫియట్ లీనియా క్లాసిక్ సరసమైన ధరకే లభించే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి: భారత్‌కు రానున్న అన్ని కొత్త కార్ల డిటేల్స్


ఇక యాంత్రికపరమైన మార్పుల విషయానికి వస్తే, పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న 1.3 లీటర్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కొత్త లీనియా క్లాసిక్‌లో ఉపయోగించనున్నారు. రెగ్యులర్ లీనియా సెడాన్‌లో ఉపయోగించిన ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని, 209 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, లీనియా క్లాసిక్‌లో ఉపయోగించనున్న ఇంజన్‌ను కొద్దిగా ట్యూన్ చేసి పవర్‌ను 75 పిఎస్‌లకు టార్క్‌ను 190 ఎన్ఎమ్‌లకు తగ్గించినట్లు తెలుస్తోంది.

పెట్రోల్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇందులో అదే 1.4 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఫియట్ లీనియా సెడాన్ కన్నా లీనియా క్లాసిక్ సెడాన్ సుమారు రూ.50,000 వరకు తక్కువ ధర కలిగి ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా ఫోర్డ్ క్లాసిక్ సెడాన్‌తో తలపడనుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Realising the opportunity being lost in the relatively high selling mid-range C-segment sedan category Fiat has decided to slot a low cost Linea between the Punto and the existing Linea sedan. Linea Classic as it is called, will be launched on September 25. The cut cost Fiat Linea Classic will naturally come with a few missing features.
Story first published: Wednesday, September 25, 2013, 10:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X