విస్తరణ కోసం ఫోర్స్ మోటార్స్ నుంచి రూ.1000 కోట్ల పెట్టుబడి

By Ravi

ప్రముఖ వాణిజ్టయ వాహనాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్, గడచిన సంవత్సరంలో ప్రకటించినట్లుగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లు పెట్టుబడులను వెచ్చించి విస్తరణ ప్రణాళికలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆటోమొబైల్ పరిశ్రమలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ, తాము మాత్రం పెట్టుబడి పెట్టడానికే నిర్ణయించామని ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా తెలిపారు.

ఈ పెట్టుబడిని, తమ బ్రాండ్ స్థాయిని పెంచుకునేందుకు దానితో పాటు ఇంజినీరింగ్ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఉపయోగించుకోనున్నట్లు ఆయన వివరించారు. రానున్న మూడేళ్లకు గాను రూ.1,000 కోట్లు పెట్టుబడి వెచ్చిస్తామని ఫోర్స్ మోటార్స్ గడచిన సంవత్సరంలో ప్రకటించింది.

Force Motors

డాలర్ మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో, ఫోర్స్ మోటార్స్ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతుందా అన్న ప్రశ్నకు ఆయన సమధానమిస్తూ.. ప్రస్తుతం తాము పరిస్థితిని అధ్యయనం చేస్తున్నామని, రూపాయి ఇదే తరహాలో క్షీణిస్తుంటే, తప్పక ధరలు పెంచక తప్పదని అన్నారు. ఈ అంశంపై రానున్న రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఫిరోడియా అన్నారు.

ఆర్థిక మందగమనం ప్యాసింజర్ కార్ల అమ్మకాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని, ఈ విభాగంలో అమ్మకాలు యధావిధిగానే కొనసాగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్రలోని పూనేకు చెందిన ఫోర్స్ మోటార్స్ రూ.2 లక్షల నుంచి రూ.14 లక్షల రేంజ్‌లో వాణిజ్య వాహనాలను విక్రయిస్తోంది. ఇవే కాకుండా ఫోర్స్ వన్, గుర్ఖా ఎస్‌యూవీలను కూడా విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Commercial vehicle maker Force Motors on Thursday said it is going ahead with its Rs 1,000 crore investment which it announced last year despite the industry facing a slowdown.
Story first published: Friday, September 6, 2013, 10:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X