ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సక్సెస్: 17 రోజుల్లో 25,000 బుకింగ్స్

ముందు నుంచి ఊహించినట్లుగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మార్కెట్లో మాంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈకోస్పోర్ట్ విషయంలో ఫోర్డ్ చాలా తెలివిగా వ్యవహరించింది. ఈ ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేయటానికి ముందుగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహిచింది. దేశవ్యాప్తంగా ఈ కారును వివిధ ప్రధాన నగరాల్లో ప్రదర్శిచింది. దీంతో ఈకోస్పోర్ట్ పట్ల కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది. వేరే కారు కొనాలనుకున్న వారు కూడా ఈకోస్పోర్ట్ విడుదలయ్యే వరకూ వేచి చూసి, తమ మనసు మార్చుకొని ఈకోస్పోర్ట్‌ను ఎంచుకున్నారు.

ఇంకేముంది, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మార్కెట్లో విడుదల కాగానే, దీనిని సరసమైన ధరకు అందరూ ఫ్లాట్ అయి పోయారు. సాధారణ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్ల ధరకే వాటి కన్నా మరింత ఉత్తమమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ లభిస్తుండటంతో ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఈకోస్పోర్ట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవటం మొదలుపెట్టింది. వేలకొద్దీ బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఈ కారు మార్కెట్లోకి 17 రోజులు కూడా కాలేదు అప్పుడే 25,000 మంది దీనిని బుక్ చేసుకున్నారు.

దీన్నిబట్టి చూస్తే, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సక్సెస్ అయినట్లే అని తెలుస్తోంది. గడచిన సంవత్సరంలో ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో కేవలం 75,500 కార్లను మాత్రమే విక్రయించింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ చలవతో ఈ ఏడాది అమ్మకాల సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంపాక్ట్ డిజైన్, కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్‌కు తోడు ఆకర్షనీయమైన ధరే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సక్సెస్‌కు కారణం అని చెప్పొచ్చు. మరి మీరేమంటారు..?

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Ford Ecosport
Most Read Articles

English summary
It’s been a little over 17 days since the launch of Ford EcoSport. DNA has now revealed that the total bookings have crossed 25,000 units. But, Ford is yet to confirm this number.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X