30000 బుకింగ్‌లను దక్కించుకున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్

Ford EcoSport Bookings
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఇది మార్కెట్లోకి విడుదలైన మొదటి మూడు వారాల్లోనే 30,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఓవైపు భారత ఆటోమొబైల్ మార్కెట్ మందకొడిగా సాగుతూ, దాదాపుగా అన్ని ప్రముఖ కార్ కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పడుతుంటే, ఈకోస్పోర్ట్ వలన ఫోర్డ్ అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. ఈ సెగ్మెంట్లో కెల్లా సరసమైన ధరకే విడుదలైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్, వెలకు తగిన విలువను, ప్రయోజాన్ని అందిస్తుంది.

గతంలో ఫోర్డ్ ఇండియా విడుదల చేసిన చిన్న కారు ఫిగో బుకింగ్స్ కన్నా ఈకోస్పోర్ట్ బుకింగ్సే ఎక్కువగా ఉన్నాయి. ఫిగో విడుదలైన మొదటి 100 రోజులకు గాను కేవలం 15,000 నుంచి 20,000 బుకింగ్‌లను మాత్రమే దక్కించుకుంది. ఈకోస్పోర్ట్ కేవలం 17 రోజుల్లోనే 30,000 బుకింగ్‌లను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదిలా ఉండగా.. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్లో గ్లో ప్లగ్ మాడ్యూల్ సమస్య కారణంగా 972 యూనిట్ల డీజిల్ ఈకోస్పోర్ట్ కార్లను రీకాల్ చేసినప్పటికీ, అది బుకింగ్స్‌‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఇది విడుదలైన రెండు వారాల్లోనే రీకాల్ ప్రకటించినా కొనుగోలుదారులు మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ కాంపాక్ట్ కారును సొంతం చేసుకుంటున్నారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు అంత క్రేజ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Within 17 days of the launch of its much awaited sports utility vehicle EcoSport, Ford India has received an overwhelming response by garnering 30,000 bookings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X